హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : మరో శ్రద్ధావాకర్.. ఆఫ్తాబ్.. ఇది విదేశాల్లో జరిగిన ప్రేమ హత్య

Crime : మరో శ్రద్ధావాకర్.. ఆఫ్తాబ్.. ఇది విదేశాల్లో జరిగిన ప్రేమ హత్య

మరో శ్రద్ధావాకర్.. ఆఫ్తాబ్.. ఇది విదేశాల్లో జరిగిన ప్రేమ హత్య

మరో శ్రద్ధావాకర్.. ఆఫ్తాబ్.. ఇది విదేశాల్లో జరిగిన ప్రేమ హత్య

ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్న వారంతా ఉలిక్కిపడేలా చేసిన క్రైమ్ ఇది. ఈ కేసు పోలీసుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. దీని వెనక జరిగిన నేరం, అందుకు దారి తీసిన పరిణామాలు.. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్యను గుర్తు చేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తల్లిదండ్రుల మాట వినకుండా.. ఆఫ్తాబ్‌ని గుడ్డిగా నమ్మి, ప్రాణంగా ప్రేమించి.. అతని చేతిలోనూ 35 ముక్కలై ప్రాణాలు కోల్పోయిన శ్రద్ధా వాకర్ తరహా ఘటన ఒకటి విదేశాల్లో జరిగింది. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన ప్రియుడి కోసం ఆ మెక్సికో మహిళ ఏకంగా.. 5వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత నేరం జరిగింది. ఏమైందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆమె పేరు బ్లాంకా ఒలీవియా ఎరెల్లానో గుటెర్రెజ్. వయసు 51 ఏళ్లు. ఆమెకు జువాన్ పాబ్లో విల్లాఫర్టే.. ఓ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయం అయ్యొడు. కొన్ని రోజులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వయసులో తనకు ఇలాంటి తోడు దొరకడం తన అదృష్టం అనుకుంది. కొన్ని రోజుల తర్వాత మనం డైరెక్టుగా కలుద్దామా అన్నాడు. సరే అది. నేను నీ దగ్గరకు రావడం కుదరదు.. నువ్వు వస్తావా అని అడిగాడు. సరే అంటూ.. మెక్సికో నుంచి 5వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరూకి వెళ్లింది బ్లాంక్. కానీ తన జీవితం అక్కడ బ్లాంక్ అవుతుందని ఊహించలేకపోయింది.

బ్లాంకాను ఎయిర్‌పోర్టులో కలిసిన ప్రియుడు జువాన్ ఓ హగ్ ఇచ్చాడు. కారులో ఆమెను ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. బ్లాంకా నుంచి ఏ కాంటాక్టూ లేకపోవడంతో.. ఆమె ఆంటీ.. పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు జువాన్‌కి ఫోన్ చేయగా.. ఆమెను కలిసి.. తిరిగి మెక్సికోకి పంపేశానని తెలిపాడు. దాంతో పోలీసులు సెర్చ్ మొదలుపెట్టారు. పెరూ పోలీసులకు విషయం చెప్పారు. నవంబర్ 9న ఓ జాలరి.. పెరూ పోలీసులకు కాల్ చేసి.. హువాచో సముద్ర తీరంలో ఓ మహిళ శవం ఉందనీ.. నీటిలో తేలుతోందని తెలిపాడు. పెరూ పోలీసులు అది బ్లాంకా బాడీ అని గుర్తించారు.

జువాన్‌.. బ్లాంకాను.. హోటల్ నుంచి... సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. ఆమె శరీరంలో కిడ్నీలు సహా... కొన్ని కీలక అవయవాలు లేవు. ఈ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు మరో విషయం అర్థమైంది. ఆ జువాన్.. ఓ ఆర్గాన్ మాఫియాతో సంబంధాలు కలిగివున్నాడు. అంటే... ఆమెను చంపేసి.. కీలక అవయవాల్ని పట్టుకుపోయాడన్నమాట.

Crime : టాలీవుడ్ సినీ నటులే టార్గెట్.. అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

పోలీసులు ప్రస్తుతం జువాన్ కోసం గాలిస్తున్నారు. అతను పరారీలో ఉన్నాడు. ఇలా లేటు వయసులో ప్రేమలో పడి.. ప్రియుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన బ్లాంకా... దారుణమైన మరణాన్ని చూసింది. ఇప్పుడు ఆమె పేరు మీద హ్యాష్ ట్యాగ్ బ్లాంకా, జస్టిస్ ఫర్ పారా బ్లాంకా.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆమెకు న్యాయం చెయ్యాలని నెటిజన్లు కోరుతున్నారు.

First published:

Tags: Crime, Crime news, International news

ఉత్తమ కథలు