హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడు.. న్యాయం కోసం పోరాడితే ఇంత దారుణమా..

Telangana: ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడు.. న్యాయం కోసం పోరాడితే ఇంత దారుణమా..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రేమించాడు.. పెళ్ళి కూడా చేసుకుంటానన్నాడు. చివరకు ముఖం చాటేశాడు. దీంతో ఆ బాధితురాలు న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఆమెకు న్యాయం చేయాల్సిన ప్రియుడి తరఫు బంధువులు ఆ యువతిపైనే దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ప్రియురాలు ఆసుపత్రిపాలైంది.

ఇంకా చదవండి ...

ప్రేమించాడు.. పెళ్ళి కూడా చేసుకుంటానన్నాడు. చివరకు ముఖం చాటేశాడు. దీంతో ఆ బాధితురాలు న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఆమెకు న్యాయం చేయాల్సిన ప్రియుడి తరఫు బంధువులు ఆ యువతిపైనే దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ప్రియురాలు ఆసుపత్రిపాలైంది. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మామడ మండల కేంద్రానికి చెందిన యువతి, అడ్లూరి మనోజ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని మనోజ్ ను ఆ యువతి కోరగా మనోజ్ ముఖం చాటేస్తూ వస్తున్నాడు.

దీంతో విసుగు చెందిన ఆ యువతి ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. ఇది జీర్ణించుకోలేని మనోజ్ బంధువులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు తీవ్ర గాయాలపాలవడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకుంది. బాధితురాలి సోదరుడు ఆమెను వెంటనే స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ లో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు.

విషయం తెలుసుకున్న ప్రియుడు మనోజ్ పరారీలో ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరితే కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆ యువతి రోదిస్తూ తెలిపింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. ఈ మేరకు మామడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మామడ ఎస్ ఐ వినయ్ కుమార్ తెలిపారు.

First published:

Tags: Attack, Crime news, Love affair

ఉత్తమ కథలు