హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి..15రోజులకే శవంగా..

OMG : ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి..15రోజులకే శవంగా..

కూతుర్ని మోసం చేశాడని యువకుడిని కాల్చి చంపిన తండ్రి

కూతుర్ని మోసం చేశాడని యువకుడిని కాల్చి చంపిన తండ్రి

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో యువతితో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని అతడి ప్రియురాలి తండ్రి, సోదరుడు కాల్చిచంపారు.

Lover did nor marry daughter father shot him : ప్రేమ వ్యవహారం(Love Affair) ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో యువతితో పెళ్లి(Marriage) చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని అతడి ప్రియురాలి తండ్రి, సోదరుడు కాల్చిచంపారు. ప్రియురాలి తండ్రి కన్హయ్య, కొడుకుతో కలిసి తన ఇంటి సమీపంలోనే యువకుడిపై కాల్పులు జరిపాడు. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు మరియు గ్రామస్తులు ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు. తలలో  అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బీహార్(Bihar) రాష్ట్రంలోని పుల్వారి షరిఫ్ సమీపంలోని గ్రామానికి చెందిన న ఓ అమ్మాయిని సూరజ్ కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోమని ప్రియురాలిని తరచూ అడిగేవాడు.

ఇదే విషయాన్ని ప్రియురాలి తండ్రి కన్హయ్య, కొడుకుతో కలిసి తన ఇంటి సమీపంలోనే యువకుడిపై కాల్పులు జరిపాడు.ఈ సమాచారం ప్రియురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. అబ్బాయిని అడగగా.. పెళ్లి గురించి కూడా మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. సూరజ్ కుటుంబసభ్యులు మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం సూరజ్‌కి వేరే చోట మరో అమ్మాయితో పెళ్లి చేశారు అతడి కుటుంబసభ్యులు. సూరజ్ కి పెళ్లయిన రోజు నుంచి ప్రియురాలి కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. అవకాశం కోసం ఎదురుచూశారు. గురువారం రాత్రి అవకాశం చూసి ప్రియురాలి తండ్రి కొడుకుతో కలిసి..సూరజ్ పై అతడి ఇంటి బయటే కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సూరజ్ ని ట్రీట్మెంట్ కోసం సమీపంలోని ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సూరజ్ మృతి చెందాడు. కాల్పుల తర్వాత నిందితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఫుల్వారిషరీఫ్ పోలీసులు ప్రియురాలి తండ్రి కన్హయ్య, అతని కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Husband : భార్య జుట్టు కత్తిరించి గుండు చేసిన భర్త..ఎందుకో తెలిస్తే వాడిని కోసి కారంపెడతారు!

మరోవైపు,బీహార్(Bihar)రాజధాని పాట్నా(Patna)లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. బీహార్ రాష్ట్రానికి చెందిన సోనమ్‌దేవికి ఎనిమిదేళ్ల క్రితం.. జఫ్రాబాద్‌లోని ప్రవీణ్‌చాక్‌కి చెందిన దేవాలాల్‌తో వివాహమైంది. పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త మరణించడంతో భర్త సోదరుడైన  సేవాలాల్‌ను సోనమ్‌దేవి వివాహం చేసుకుంది. సోనమ్‌దేవితో వివాహం చేసుకున్న తర్వాత,..సేవాలాల్  కుటుంబసభ్యులు కట్నం కోసం అతడికి మరో వివాహం ఏర్పాటు చేశారు. దీనిని సోనమ్ దేవి తరచుగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయమై సోనమ్ తన భర్త, అత్తమామలతో తరచూ గొడవపడేది. ఈ క్రమంలో భర్త సేవాలాల్, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేస్తుండేవారు. ఈ విషయమై స్థానిక ఫతుహా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు తన భర్తతో సహా అత్తమామలపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసింది. దీనికి ప్రతీకారంగా మంగళవారం అత్తమామలు సోనమ్ దేవిని కర్రలతో కొట్టి, ఇటుకలతో చితకబాది దారుణంగా హత్య చేశారు. ఘటన అనంతరం నిందితులు అత్తమామలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇటుకలు, రాళ్లతో కుటుంబసభ్యులు తన తల్లిని హత్య చేసినట్లు మృతురాలి 6 ఏళ్ల కుమారుడు, ఘటన ప్రత్యక్ష సాక్షి వివేక్‌కుమార్‌ తెలిపాడు.

First published:

Tags: Bihar, Crime news, Love cheating

ఉత్తమ కథలు