LOVER COMMITTED SUICIDE IN MANDORE AREA BY KILLING HIS GIRLFRIEND INCIDENT HAPPEND IN JODHPUR RAJASTHAN SSR
Lovers: షాకింగ్ ఘటన.. ఐదేళ్ల ప్రేమకు ఇంత దారుణమైన ముగింపును ఏ లవర్స్ కోరుకోరు..
లక్షిత, హేమంత్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాలీ జిల్లాకు చెందిన లక్షిత అనే యువతి జోధ్‌పూర్‌లో హాస్టల్లో ఉంటూ ‘లా’ చదువుతోంది. నాగౌర్ జిల్లాకు చెందిన హేమంత్ అనే యువకుడు, లక్షిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాలీ జిల్లాకు చెందిన లక్షిత అనే యువతి జోధ్‌పూర్‌లో హాస్టల్లో ఉంటూ ‘లా’ చదువుతోంది. నాగౌర్ జిల్లాకు చెందిన హేమంత్ అనే యువకుడు, లక్షిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. హేమంత్‌కు బట్టల దుకాణం ఉంది. లక్షిత, హేమంత్ ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టంగా ఉండేవారు. హేమంత్ కూడా డబ్బులు దండిగానే సంపాదిస్తుండటంతో ప్రియురాలితో కలిసి సినిమాలకు, షికార్లకు, షాపింగ్స్‌కు తెగ వెళుతుండేవాడు.
ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఏ కారణంగానో పెళ్లి వైపు అడుగులేయలేదు. వారం క్రితం లక్షితకు వేరే యువకుడితో నిశ్చితార్థమైంది. ఈ పరిణామంతో ఆమె ప్రియుడు హేమంత్ రగిలిపోయాడు. హాస్టల్‌కు వెళ్లి ఆమెను కలిశాడు. నిశ్చితార్థం విషయంలో లక్షితతో హేమంత్ గొడవ పెట్టుకున్నాడు. ప్రియురాలిపై తీవ్ర ఆగ్రహంతో ఆమెను పదిసార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న లక్షితను ఆమె హాస్టల్మేట్స్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లను గుర్తించి హత్య జరిగినట్లు నిర్ధారించారు. ఆమె హాస్టల్మేట్స్ను ఏం జరిగిందని ఆరా తీశారు. హేమంత్, లక్షిత ప్రేమించుకున్నారని.. అయితే.. లక్షితకు వారం క్రితం మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. ఇవాళ కూడా హేమంత్ వచ్చి వెళ్లాడని.. ఆ తర్వాత లక్షిత చనిపోయి కనిపించిందని హాస్టల్మేట్స్ చెప్పారు. లక్షితను హేమంత్ హత్య చేశాడని భావించిన పోలీసులు హేమంత్ కోసం వెతుకుతుండగానే రైలు పట్టాలపై అతని శవం కనిపించింది. రైలు కింద పడటంతో హేమంత్ దేహం రెండు ముక్కలైంది.
మంధోర్ రైల్వే స్టేషన్ సమీపంలో హేమంత్ మృతదేహం లభ్యమైంది. అతని జేబులో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా హేమంత్గా పోలీసులు గుర్తించారు. హేమంత్, లక్షిత మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు అప్పగించారు. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటుదన్న కోపంతోనే లక్షితను హేమంత్ చంపేశాడని, ఆ బాధను తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం జోధ్‌పూర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.