Shocking crime : ప్రియురాలని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్(Gwalior)లో వెలుగు చూసింది. ఓ యువకుడు తన వివాహిత ప్రియురాలిని తన దుకాణానికి పిలిపించి కాల్చి చంపి, ఆపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ప్రియుడు 24 గంటల తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. ఈ హత్య, ఆత్మహత్య ఘటన గ్వాలియర్‌లోని భితర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌గఢ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు యువకుడి తల్లిదండ్రులు, సోదరుడు, మామపై హత్య కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్తీ చౌహాన్,పవన్ రానా ఇద్దరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. దాతియాలోని ఇందర్‌గఢ్‌కు చెందిన సోనుతో మాల్తీకి మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే మాల్తీ.. సోనూ నుంచి విడాకులు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం మాల్తీ రెండో వివాహం గ్వాలియర్‌లో జరిగింది. రెండవ వివాహం తర్వాత మాల్తీ తన అత్తమామల ఇంటి నుండి మోహన్‌గఢ్‌లోని తన తల్లి ఇంటికి మొదటిసారి వచ్చింది. ఆదివారం అత్తమామలు మాల్తీని తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. అయితే శనివారం మాల్తీ పొరుగింట్లోనే ఉండే పవన్ రానా తన షాపుకి పిలిచి కాల్చి చంపాడు. ఆ తర్వాత పవన్ గుడి దగ్గరికి వెళ్లీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తస్రావం అవుతున్న మాల్తీని భితర్వార్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అప్పటికే మాల్తీని చనిపోయినట్లు ప్రకటించారు. అదే సమయంలో, తీవ్రంగా గాయపడిన పవన్‌ను భీతర్వార్ నుండి చికిత్స కోసం గ్వాలియర్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ 24 గంటల తర్వాత పవన్ కూడా మరణించాడు.
Soldier lynched : జవాన్ కూతూరుపై అశ్లీల వీడియో..తొలగించమన్నాడని సైనికుడిని కొట్టి చంపారు!
పవన్ తల్లి వందన తన సోదరి మాల్తీని తన ఇంటికి పిలిచిందని మాల్తీ సోదరుడు హరిఓమ్ తెలిపారు. అక్కడ వారంతా కలిసి పవన్ సోదరి మాల్తీని హత్య చేశారు. మాల్తీ సోదరుడు హరియోమ్ ఫిర్యాదు మేరకు బితర్వార్ పోలీసులు శనివారం అర్థరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోరెన్సిక్ పరీక్షల ఆధారంగా, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు, పవన్ సహా ఐదుగురిపై పోలీసులు 302 కేసు నమోదు చేశారు. మాల్తీ హత్యకు సంబంధించి పోలీసులు పవన్ రానా, అతని తండ్రి భూపేంద్ర రాణా, తల్లి వందనా రాణా, సోదరుడు ఉపేంద్ర రాణా, మామ ఉమ్రావ్‌లపై హత్య కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను పోలీసులు బంధువులకు అప్పగించారు. మాల్తీ, పవన్ ఇద్దరూ ఒకరికొకరు సుపరిచితులని అదనపు పోలీసు సూపరింటెండెంట్ జైరాజ్ కుబేర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Madhya pradesh