ఫ్రెండ్‌ని పెళ్లాడేందుకు లింగమార్పిడి...అబ్బాయిగా మారిన అమ్మాయి...కానీ..

దీపుగా మారిన అర్చన..తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని తహతహలాడాడు. వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు. కానీ ఆమె చెప్పిన మాటలు విని..దీపు షాకయ్యాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో...దీపు గుండెలు పగిలిపోయాయి. కలలు చెల్లాచెదురయ్యాయి.

Shiva Kumar Addula | news18-telugu
Updated: January 21, 2019, 4:54 PM IST
ఫ్రెండ్‌ని పెళ్లాడేందుకు లింగమార్పిడి...అబ్బాయిగా మారిన అమ్మాయి...కానీ..
దీపు
Shiva Kumar Addula | news18-telugu
Updated: January 21, 2019, 4:54 PM IST
ఇద్దరూ అమ్మాయిలే..! మంచి మిత్రులు..! ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం.జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలనుకున్నారు. కానీ పెళ్లిళ్లైతే అది కుదురదు. అప్పుడప్పుడూ కలిసే అవకాశం ఉన్నా..అది వాళ్లకు సరిపోదు. నిత్యం ఒకరికి తోడుగా మరొకరు ఉండాలి. అదే వారిక కల. ఎందుకంటే వాళ్లు మిత్రులు కాదు. ప్రేమికులు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి...! ఐతే వారికి అడ్డొచ్చిందల్లా..జెండర్ (లింగం). ఇద్దరూ అమ్మాయిలు కావడంతో పెళ్లి చేసుకోలేని పరిస్థితి. అలాగని వేర్వేరుగా ఉండలేని ప్రేమ పిచ్చి. అందుకే..అందులో ఒకరు త్యాగం చేశారు. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిగా మారారు.

అర్చనా రాజ్ (23), అన్వేషిత (22) (పేరు మార్చాం)..! పైన చెప్పిన స్టోరీ వీళ్లదే..! స్వస్థలం..కేరళలోని కోజికోడ్. ఈ స్నేహితులు పెళ్లి చేసుకోవాలంటే ఎవరో ఒకరు అబ్బాయిగా మారాలి. అర్చనా రాజ్ ఆ త్యాగం చేసింది. పరస్పర అంగీకారంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 25న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అర్చన జెండర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకుంది. ఆ ఆపరేషన్‌కు రూ.2లక్షలు ఖర్చయ్యాయి. మందులు, ఇతర ఖర్చులు అదనం. సర్జరీ తర్వాత కోలుకున్న అర్చన..దీపు దర్శన్‌గా పేర్చుకుంది.


దీపుగా మారిన అర్చన..తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని తహతహలాడాడు. వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు. కానీ ఆమె చెప్పిన మాటలు విని..దీపు షాకయ్యాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో...అతడి గుండెలు పగిలిపోయాయి. కలలు చెల్లాచెదురయ్యాయి. కన్నీళ్లను ఆపుకోలేక..చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. ఐనా తన ప్రేయసిపై ప్రేమ చావక..పదే పదే రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అన్వేషిత గుండె మాత్రం కరగలేదు. తన జీవితంలోకి రావొద్దంటూ..మొత్తనికే దూరం పెట్టేసింది. అంతేకాదు వేరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమైపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసే ఇలా చేయడంతో..దీపు షాక్‌లో నుంచి కోలుకోలేదు.

కాగా, కొన్ని రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు దీపు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసుల వద్ద గోడు వెల్లబోసుకున్నాడు. తన ప్రేయసి కోసమే తాను అబ్బాయిగా మారానని..కానీ నట్టేట ముంచిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నాడు. పోలీసులు అన్వేషితను పిలిచి ఎంక్వైరీ చేస్తే..ఊహించని సమాధానం వచ్చింది. తన వైఖరిలో మార్పు లేకపోగా..దీపు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులకు తెలిపింది. దాంతో అతడు మరింత కృంగిపోయాడు. దేవభూమి కేరళలో జరిగిన ఉదంతం..ఈ తరహా ప్రేమలకు ఓ గుణపాఠం కానుంది.VIDEO: ఘనంగా హల్వా వేడుక...బడ్జెట్ ప్రింటింగ్ షురూ
First published: January 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...