• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LOVER ATTEMPTED TO COMMIT SUICIDE AFTER HER PARENTS REJECTED LOVE MARRIAGE BOY DEAD AND GIRL RESCUED BY LOCAL IN GUNTUR DISTRICT HERE ARE THE DETAILS PRN GNT

Andhra Pradesh: ప్రేమపెళ్లికి ఒప్పుకోని పెద్దలు... ప్రియుడు ఆత్మహత్య.. ప్రియురాలు ఏం చేసిందంటే..

Andhra Pradesh: ప్రేమపెళ్లికి ఒప్పుకోని పెద్దలు... ప్రియుడు ఆత్మహత్య.. ప్రియురాలు ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: ఒడిశాలోని (Odisha) భద్రక్ జిల్లా మాలాడకుచెందిన మనోజ్ దాస్ అనే యువకుడు ఆరేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనతో పాటే పనిచేస్తున్న యువతితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమ (Love)గా మారింది.

  • Share this:
    వాళ్లిద్దరూ ఒకే చోట కలిసి పనిచేస్తారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అన్ని లవ్ స్టోరీల మాదిరిగానే పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా అబ్బాయిపై పోలీస్ కేసు పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ప్రియుడి ఆత్మహత్యతో అమ్మాయి కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. కానీ స్థానికులు ఆమెను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో ఒడిశా రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాయి. ఒడిశాలోని భద్రక్ జిల్లా మాలాడకుచెందిన మనోజ్ దాస్ అనే యువకుడు ఆరేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనతో పాటే పనిచేస్తున్న యువతితో పరిచయమైంది.

    కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు ఇద్దర్నీ మందలించారు. ఐతే మనోజ్ దాస్ మాత్రం ప్రియురాలి తల్లిదండ్రులకు విషయం చెప్పి.. పెళ్లి చేయాలని కోరాడు. దీనికి నిరాకరించిన అమ్మాయి తల్లిదండ్రులు.. అతడిపై ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువైపుల పెద్దలను పిలిపించిన పోలీసులు.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.

    ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన మనోజ్ దాస్.., స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో తాను నివసించే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ మనోజ్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనోజ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అతడి ప్రియురాలు.. తీవ్ర మనస్తాపానికి గురైంది. మనోజ్ ఆత్మహత్య చేసుకున్న భవనంపైకి ఎక్కి  దూకేందుకు యత్నించగా.. స్థానికులు ఆమెను రక్షించారు. తన తల్లిదండ్రుల వల్లే మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    గతంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రేమికులు క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకొవద్దని.. పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేయాలని పోలీసులు చెప్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు