news18-telugu
Updated: November 25, 2020, 7:13 PM IST
పెళ్ళింట విషాదం విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మోళం వినిపించింది. మేడలో తాళి కట్టుంచుకుని ఆనందంగా ఉండాల్సిన ఆ యువతి ప్రియుడి చేతిలో హత్యకు గురైంది.
పెళ్ళింట విషాదం విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మోళం వినిపించింది. మేడలో తాళి కట్టుంచుకుని ఆనందంగా ఉండాల్సిన ఆ యువతి ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాహిదా బేగం (19) అనే యువతిని రఘు యువకుడు గత మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోగా ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి నిశ్చయించారు. ఈ పెళ్ళి ఇష్టంలేని వారిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారిద్దరూ పురుగుల మందును కొనుగొలు చేసి దాన్ని ఇరువురు కలిసి తాగలని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళారు. అయితే రఘు పురుగుల మందు తాగినప్పటికి, ఆ యువతి మాత్రం తాగలేదు. పురుగుల మందు తాగిన రఘును స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కొద్దిరోజుల తర్వాత కోలుకున్న రఘు మళ్లీ ప్రేయసిని కలిశాడు. కలిసి ఆత్మహత్య చేసుకోవాలని చేప్పి మోసం చేస్తావా.. పైగా మరొకరితో పెళ్లికి సిద్ధమవుతవా! అంటూ ఆమె వద్ద తన మనోవేదనను వ్యక్తం చేశాడు.
ఈ నెల 17న రాత్రి మరోసారి ఆమెను కలిసిన రఘు.. ఆ యువతిని నమ్మించి ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతను ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రఘును నిలదీశారు. అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు కణేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. తర్వాత దాన్ని బయటకు తీసి పరిశీలించగా ఆ మృతదేహాం షాహిదా బేగంగా నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులు రఘును అదుపులోకి తీసుకుని విచారించగా పలు హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు.
Published by:
Rekulapally Saichand
First published:
November 25, 2020, 7:12 PM IST