హోమ్ /వార్తలు /క్రైమ్ /

Triangle Love : ఇద్దరు యువకులతో ఓ యువతి ఎఫైర్..ఒకరికి తెలియకుండా మరొకరితో యవ్వారం..చివరికి

Triangle Love : ఇద్దరు యువకులతో ఓ యువతి ఎఫైర్..ఒకరికి తెలియకుండా మరొకరితో యవ్వారం..చివరికి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Two lovers fought over One girlfriend:రాజస్తాన్ లోని జైపూర్‌లో ట్రయాంగిల్ లవ్(Triangle Love) సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఇక ప్రియురాళ్ల కోసం బాయ్‌ఫ్రెండ్స్ ఇద్దరూ గొడవపడ్డారు.

ఇంకా చదవండి ...

  Two lovers fought over One girlfriend : రాజస్తాన్(Rajastan) లోని జైపూర్‌లో ట్రయాంగిల్ లవ్(Triangle Love) సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఇక ప్రియురాళ్ల కోసం బాయ్‌ఫ్రెండ్స్ ఇద్దరూ గొడవపడ్డారు. యువకులిద్దరితో కొన్నాళ్లుగా యువతి ప్రేమ సంబంధం కొనసాగుతోందని సమాచారం. అమ్మాయి వేరొకరితో ఉందని ఓ అబ్బాయికి తెలియడంతో ప్రేమికులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియురాలి విషయంలో ఇద్దరికీ గొడవ(Fight) జరిగింది. ఈ గొడవపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకులిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  జైపూర్ లోని జగత్‌పురాలో ఉండే ఇద్దరు యువకులు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. అదే ప్రాంతంలో చదువుతోన్న ఓ యువతితో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో ఉన్నారు. యువతి కూడా ఒకరికి తెలియకుండా మరొకరితో లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. కొద్ది రోజులుగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. అయితే గురువారం ఇద్దరిలోని ఓ యువకుడికి తన ప్రియురాలు మరో యువకుడితో ఉన్నట్లు తెలిసింది. దీని తర్వాత యువకుడు మరొకరి చిరునామాను తెలుసుకొని గురువారం రాత్రి అతడిని వెళ్లి కలిశాడు. తన ప్రియురాలికి మరో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని అవతలి కుర్రాడికి కూడా తెలియడంతో అతడికి మైండ్ బ్లాక్ అయ్యింది. అమ్మాయి విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. వో మేరీ హై-వో మేరీ హై అంటూ యువకులిద్దరూ నీతో గొడవ పడ్డారని స్థానికులు చెబుతున్నారు. యువకులిద్దరి మధ్య గొడవ ముదరడంతో ఈ గొడవపై స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

  Shiva Temple : ఆ శివాలయంలో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లవర్స్ కి ఫ్రీగా షెల్టర్,ఫుడ్

  మరోవైపు,భార్యకు మాయమాటలు చెప్పి ప్రియురాలితో(Girlfriend) ఎంజాయ్ చేసేందుకు ఫారిన్ వెళ్లిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పాస్ పోర్ట్ లో చిరిగిన ఓ పేజీ వల్లే అతడి గుట్టు బయటపడింది. అతను ముంబై విమానాశ్రయానికి(Mumbai Airport) తిరిగి వచ్చినప్పుడు, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో అతని పాస్‌పోర్ట్‌(Passport)లో కొన్ని పేజీలు లేవు. అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు అతడిని అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి వృత్తిరీత్యా ఇంజనీర్. ముంబైలోనే ఓ MNC(మల్టీ నేషనల్ కంపెనీ) కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాడు. ప్రియురాలిని కలిసేందుకు మాల్దీవులకి వెళ్లాడు. మాల్దీవుల్లో ప్రియురాలితో కొద్ది రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. అయితే ఈ సమయంలో అతని భార్యకు అనుమానం వచ్చింది. ఆమె ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ ని అతడు ఎత్తలేదు. దీని తర్వాత, తన భార్య నుండి విదేశీ ప్రయాణ విషయాన్ని దాచడానికి, అతను పాస్ పోర్ట్ నుండి పేజీలను తొలగించాడు. ఇంటికి తిరిగొచ్చాక తన పాస్ పోర్ట్ చూస్తే తాను మాల్దీవులకి వెళ్లానని తెలుస్తోందని తన పాస్ పోర్ట్ లో ట్రావెల్ వీసా స్టాంప్ ఉన్న పేజీలని చింపేసి ముంబైకి తిరుగుపయనమయ్యాడు. గురువారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. ముంబై విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో అతని పాస్‌పోర్ట్‌లో . అతని తాజా ట్రావెల్ వీసా స్టాంప్‌ని కలిగి ఉండే పేజీలు లేవు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Love affiar, Love cheating, Rajastan

  ఉత్తమ కథలు