Lover Burnt to Death Her Lover: ఒక యువకుడు, యువతిని ప్రేమించాడు. కులాలు వేరైనా ఇంట్లో ఒప్పిస్తానన్నాడు. యువతీ మనసులో లేని ఆశలు రేకెత్తించాడు. చివరకు ఇంట్లో తక్కువ కులం నుంచి అమ్మాయిని కోడలిగా ఒప్పుకోమని ఇంట్లో తెగేసీ చెప్పారు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడు కుందామని యువతిని పిలిచి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
Lover Attack On Girl: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఒకడు.. యువతిని నమ్మించి, ఆపై ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. బెంగళూరులో గత 17న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రకారం.. శివకుమార్, దానేశ్వరీ లు విజయపుర జిల్లాలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం. వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమ బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు. యువతి.. నిమ్న కులానికి చెందిన యువతి. శివకుమార్ తన ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పాడు. ఇది విన్న శివకుమార్ తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ కన్నా తక్కువ కులం నుంచి అమ్మాయిని తమ కోడలిగా అంగీకరించమని తేగేసీ చెప్పేశారు. దీంతో శివకుమార్ ఎన్నో విధాల చెప్పి చూశాడు. కానీ వారు అంగీకరించలేదు. దీంతో ఒక రోజు దానేశ్వరీని మాట్లాడుకుందామని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ జరిగిన విషయం చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శివకుమార్.. దానేశ్వరీపై చేయివేసుకున్నాడు. ఆ తర్వాత.. పెట్రోల్ పోసీ నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత.. చుట్టు పక్కల వారు బాధితురాలిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు కాలీన గాయాలతో అత్యవసర విభాగంలో చికిత్స పొందింది.
రెండు రోజుల పాటు బాధితురాలికి చికిత్స అందించారు. కానీ శరీరంలో ఎక్కువ భాగం కాలిపోవడంతో బాధితురాలి శరీరం చికిత్సకు సహాకరించలేదు. దీంతో బాధితురాలు మార్చి 17 న చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. వారిని ఓదార్చడం ఏవరి తరం కాలేదు. శివకుమార్, అతని కుటుంబ సభ్యులు ప్రేమ పేరుతో నమ్మించి నా కూతురిని హత్య చేశారని ఆరోపించారు.
దానేశ్వరీ సోదరి.. శివకుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం... తన కూతురిని తీసుకెళ్లి హతమార్చారని దానేశ్వరీ తల్లి తెలిపింది. నిందితుడు మూడు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. నిందితుడిని గాలించడానికి ప్రత్యేక పోలీసులను నియమించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Crime news, Karnataka