ప్రాణాలు తీస్తున్న ప్రేమ.. విషాదాన్ని మిగుల్చుతున్న ప్రేమ కథలు..

ప్రతీకాత్మక చిత్రం

దేశ భవిత యువత పైన ఆధారపడి ఉంది. విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించి.. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు గ‌మ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలే గానీ తాత్కాలిక ఆకర్షణలకు లోనై నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నది యువత. ప్రేమ పేరుతో వారి లక్ష్యానికి దూరమ‌వుతున్నారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  ప్రేమ బతుకు కోరుతుంది... క‌లిసి బతకాల‌ని క‌ళ‌లు కంటుంది.. స్వచ్ఛమైన ప్రేమ త్యాగాన్ని కూడా స్వకీరిస్తుంది. మ‌ర‌ణాన్ని కాదు.. అయితే కొన్ని ప్రేమ జంటలు బతికే దైర్యంలేక‌.. ఈ లోకం ఇక ఇంతే అన్నట్టుగా.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వారిని కన్నవారికి క‌డుపు కోత‌ మిగిల్చి వెళ్తున్నారు. దేశ భవిత యువత పైన ఆధారపడి ఉంది. విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు గ‌మ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలే గానీ యువత తాత్కాలిక ఆకర్షణలకు లోనై నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నది. ప్రేమ పేరుతో వారి లక్ష్యానికి దూరమ‌వుతున్నారు. ప్రేమ పేరుతో కాలక్షేపం చేసే వారిని సహజంగా పెద్దలు మందలిస్తుంటారు. అయితే అది నిజమైన ప్రేమ అని నిరూపించుకోవాలని ప్రయత్నం చేయకుండా కొందరు జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నారు. కొద్దిరోజులగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తున్నది.

  గడిచిన నెలరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రేమ విఫ‌లమై ప్రేమికులు ఆత్మహత్యల‌కు పాల్ప‌డుతున్న ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. ఓ జంట‌ పెళ్లి చేసుకొని రక్షణ కోసం కామారెడ్డి స‌దాశివ‌న‌గ‌ర్ పోలీస్ స్టేషన్ కు వెళుతున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.. ఆర్మూర్ మండలం పెర్కిట్ లో గత నెలలో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.. వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామానికి చెందిన రోహిత్ ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన అవంతి ప్రేమించుకున్నారు.. వీరిద్దరి సామాజికవర్గం కూడా ఒకటే అయినా తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించ‌క పోవ‌డంతో ఆత్మహత్య చేసుకున్నారు..

  ప్రతీకాత్మక చిత్రం


  వీరితో పాటు కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన రమ్య, గాంధారి మండలం పోతంగల్ కలాణ్ కు చెందిన సాయికుమార్ ప్రేమించుకున్నారు.. అయితే రమ్యకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం లేనివారు.. ఇద్దరు కలిసి చావాలని నిర్ణయించుకున్నారు.. దీంతో ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.. కోటగిరి మండలం పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్, విజయ ఇద్దరు ప్రేమించు కున్నారు.. ఇరుకుటుంబాల వారు పెల్లికి అంగీకరించలేదు.. అయినా నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.. సాయి ప్రణీత్ కుటుంబీకులు ఇంట్లోకి రానివ్వకపోవడం తో తన వద్ద ఉండమని విజయ వాళ్ల అమ్మ సావిత్రి తన ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసారు. దీంతో మనస్థాపానికి గురై వారు డిసెంబ‌ర్ 18న‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక‌రు మృతి చెంద‌గా మ‌రోక‌రు ప్రాణాల‌తో పోరాడుతున్నారు..ఇవన్నీ వెలుగులోకి వచ్చినవి మాత్రమే..

  అయితే ప్రేమికులు, నూతనంగా పెళ్లి చేసుకున్న జంటలు ఆత్మహత్య చేసుకోవడంపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతకు స‌రైన మార్గనిర్ధేశం చేయాల్సిన బాధ్యత త‌ల్లిదండ్రులు, ఉపాద్య‌ాయుల‌పై ఎంతైన ఉందని వారంటున్నారు. జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని.. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి తమను చదివించిన తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేయడం ఎవరికీ మంచిది కాదని తెలిపారు. ప్రేమ గొప్పదేనని.. కానీ అంతకన్నా జీవితం ఇంకా గొప్పదని హితువు పలుకుతున్నారు. ఎవరికాళ్ల మీద వాళ్లు నిలబడే సామర్థ్యం వచ్చి.. స్వయంకృషితో బతికేవారు.. వారి జీవితంలో ఇష్టమైన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే హక్కు ఉందని.. అలా ఎదిగిన వారికి ఎవరూ అడ్డుచెప్పరని అంటున్నారు. అమ్మాయిలు కూడా చాలావరకు మారారని.. రోడ్ల మీద ఖాళీగా తిరిగేవారికంటే.. తమకు భవిష్యత్తులో ఏ కష్టం రానీయకుండా చూసుకునే వారినే వివాహమాడుతున్నారని చెబుతున్నారు. ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించుకున్న తర్వాత.. వారి కలల రాణిని పెళ్లి చేసుకుంటే.. వారు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవిస్తారని వారు హితువు పలుకుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: