ప్రియుడి కోసం రూ.75 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాద్ యువతి... మూడేళ్లు కాపురం చేసి...

రహస్యంగా పెళ్లి చేసుకుని మూడేళ్లు కాపురం... తండ్రి చనిపోయారంటూ ఊరెళ్లి మళ్లీ తిరిగిరాని ప్రియుడు... ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 10:23 PM IST
ప్రియుడి కోసం రూ.75 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాద్ యువతి... మూడేళ్లు కాపురం చేసి...
ప్రియుడి కోసం లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాద్ యువతి... మూడేళ్లు కాపురం చేసి చెక్కేసిన...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 10:23 PM IST
ఆమె అతన్ని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. తనకు సర్వస్వం అయిన ప్రియుడి కోసం తాను పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చుపెట్టింది. ప్రియురాలి డబ్బుతో వ్యాపారం పెట్టుకున్న అతను, ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం కూడా చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ప్రియుడి చేతిలో మోసపోయిన విషయం గ్రహించిన ఆమె... అతని స్వస్థలానికి వెళ్లి, అతనిపై దాడి చేసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన... తెలుగురాష్ట్రాల్లో వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా టంగుటూరులోని బ్రహ్మణ బజార్ ఏరియాకు చెదిన అరవింద్, కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతనికి మణికొండ ఏరియాకు చెందిన సహస్రతో పరిచయం ఏర్పడింది. ఫోన్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. మూడేళ్ల పాటు సహస్రతో కాపురం కూడా చేశాడు అరవింద్. ఈ సమయంలో ప్రియుడి ఖర్చుల కోసం రూ.75 లక్షలు ఖర్చుచేసింది సహస్ర. ప్రియురాలి అకౌంట్‌లో డబ్బు మొత్తం అయిపోయిన తర్వాత గత ఏడాది తండ్రి చనిపోయాడంటూ స్వస్థలానికి వచ్చాడు అరవింద్. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లలేదు.

సహస్ర ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని నుంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన ఆమె... ప్రకాశం జిల్లా చేరుకుని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న అరవింద్... మూడు రోజులు ఇంటికి రావడం మానేశాడు. ఊరి బయట ఇటుక బట్టీల దగ్గర ఉంటున్నాడని విషయం తెలుసుకున్న సహస్ర అక్కడికి వెళ్లి అరవింద్‌ను ఎడాపెడా వాయించేసింది. అయితే అరవింద్ మాత్రం సహస్రను కేవలం ఓ ఫ్రెండ్‌గానే చూశానని, తన ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత కూడా ఆమె అంత డబ్బు నాకోసం ఖర్చు పెట్టిందంటే ఎలా నమ్ముతారని నిలదీస్తున్నాడు. అయితే సహస్ర మాత్రం అరవింద్ కోసం బైక్, వాచ్, తదితర ఖరీదైన వస్తువులు కొనిచ్చానని చెబుతోంది. అరవింద్‌పై టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది సహస్ర.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...