హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lovers: నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి చెల్లి ప్రేమ పెళ్లి.. ఆమె ఎలా ఉందో చూద్దామని అన్న వెళ్లగా..

Lovers: నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి చెల్లి ప్రేమ పెళ్లి.. ఆమె ఎలా ఉందో చూద్దామని అన్న వెళ్లగా..

బాధితురాలు

బాధితురాలు

ప్రేమ పెళ్లిళ్లన్నీ సుఖాంతాలు కావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు అంతే ప్రేమతో భార్యగా కూడా తన ప్రేయసిని సంతోషంగా చూసుకుంటే ఎలాంటి సమస్య లేదు. కానీ.. పెళ్లయిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే కట్నం రాలేదని, తన ప్రేయసి కట్నం తీసుకురాలేదని ఆమెను హింసిస్తే మాత్రం ఆ యువతి జీవితం నరకంగా మారుతుంది.

ఇంకా చదవండి ...

సోనిపట్: ప్రేమ పెళ్లిళ్లన్నీ సుఖాంతాలు కావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు అంతే ప్రేమతో భార్యగా కూడా తన ప్రేయసిని సంతోషంగా చూసుకుంటే ఎలాంటి సమస్య లేదు. కానీ.. పెళ్లయిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే కట్నం రాలేదని, తన ప్రేయసి కట్నం తీసుకురాలేదని ఆమెను హింసిస్తే మాత్రం ఆ యువతి జీవితం నరకంగా మారుతుంది. అలాంటి పరిస్థితులే భార్య ఆత్మహత్యకో, భర్తలో పెరిగిపోయిన ఉన్మాదం కారణంగా ఆమె హత్యకో దారితీస్తాయి. హర్యానాలోని సోనిపట్ జిల్లా రాయ్ గ్రామంలో సరిగ్గా అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని సీతాపూర్ జిల్లా ఖజురియా గ్రామానికి చెందిన షాలిని(18), ఆమె పొరుగింట్లో ఉండే విశాల్ సింగ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. పెళ్లి చేసేందుకు రెండు కుటుంబాలు అడ్డు చెప్పడంతో ఏప్రిల్ 13న ఈ జంట ఇంట్లో నుంచి వెళ్లిపోయి సీతాపూర్‌లోని శ్యామ్‌నాథ్ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. ఇద్దరూ సోనిపట్ జిల్లా రాయ్ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఒక నెలా, రెండు నెలలు షాలినిని విశాల్ సింగ్ ప్రేమగానే చూసుకున్నాడు. ఆ తర్వాత.. వెంట తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోవడంతో పుట్టింటికెళ్లి కట్నం తీసుకురావాలని విశాల్ సింగ్ షాలినిని వేధించసాగాడు. ఏ పనికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండటంతో అతని చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. పనికి వెళ్లి నమ్మి వెంట వచ్చిన షాలినిని పోషించాలన్న ఆలోచన కూడా విశాల్ చేయకపోగా.. కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తాళలేక.. తన అన్నయ్య సోనూకు షాలిని తన భర్త ప్రవర్తన గురించి మొరపెట్టుకుంది.

తొందరపడి ఇల్లు వదిలి వచ్చేశానని.. కట్నంగా రెండు లక్షలు తీసుకురావాలని విశాల్ వేధిస్తున్నాడని తన అన్నయ్యకు చెప్పింది. సీతాపూర్ ఎస్పీకి ఈ విషయమై.. విశాల్‌ కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా.. భార్యాభర్తలిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. మళ్లీ కట్నం గురించి ఆమెను ఇబ్బంది పెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత.. తన చెల్లిపై కోపంతో సోనూ కొన్నాళ్లు ఫోన్ కూడా చేయలేదు. అయితే.. ఇటీవల ఉండబట్టలేక చెల్లి ఎలా ఉందోనని.. చూసొద్దామని రాయ్ గ్రామానికి సోనూ వెళ్లాడు. ఆ ఊరికి వెళ్లగానే సోనూకు ఓ చేదు నిజం తెలిసింది. ఆగస్ట్ 10న అనుమానాస్పద స్థితిలో షాలిని చనిపోయిందని తెలిసి.. సోనూ నిర్ఘాంతపోయాడు. ఆమె అంత్యక్రియలు కూడా రాయ్ గ్రామంలోనే జరిగినట్లు తెలుసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Lovers: బ్యాచిలర్ రూమ్‌లో అద్దెకు దిగాడు.. ఓనర్ కూతురితో లవ్‌.. ఒకే బెడ్‌పై ఒక్కటయ్యారు.. చివరికి..

ఈ ఘటన గురించి.. షాలిని చనిపోయినట్లు విశాల్ సింగ్ కనీసం ఆమె కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. కట్నం కోసం వేధించి తన చెల్లిని విశాలే చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని సోనూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విశాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న షాలిని జీవితం వివాహం జరిగి నాలుగు నెలలు కూడా గడవక ముందే ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురి చివరి చూపు కూడా దక్కకుండా చేశాడని.. షాలినిని తలచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Crime news, Haryana, Love marriage, Lovers, Woman suicide

ఉత్తమ కథలు