Love Marriage: ఇదెక్కడి ఘోరం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నిద్రపోతుంటే ఏ భర్త అయినా ఇలా చేస్తాడా..

దుర్గేష్, దీపిక

ఆ యువతి ఒక యువకుడిని ప్రేమించింది. పెద్దలు ఆమె ప్రేమను కాదన్నారు. ఆ యువకుడితో పెళ్లికి అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ కన్నవాళ్లను కాదనుకుని మరీ ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ.. ఆ నిర్ణయమే ఆమెకు యమ పాశంగా మారుతుందని కలలో కూడా ఊహించలేకపోయింది.

  • Share this:
    లక్నో: ఆ యువతి ఒక యువకుడిని ప్రేమించింది. పెద్దలు ఆమె ప్రేమను కాదన్నారు. ఆ యువకుడితో పెళ్లికి అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ కన్నవాళ్లను కాదనుకుని మరీ ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ.. ఆ నిర్ణయమే ఆమెకు యమ పాశంగా మారుతుందని కలలో కూడా ఊహించలేకపోయింది. పెళ్లయిన మూడు నెలలకే భర్త చేతిలో ఆ యువతి హత్యకు గురైంది. ఈ విషాద ఘటన యూపీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గేష్ యాదవ్ అనే యువకుడు, దీపిక అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె తన ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె ప్రతిపాదనను పెద్దలు కాదనడంతో మూడు నెలల క్రితం దుర్గేష్‌తో ఇంట్లో నుంచి వెళ్లిపోయి దీపిక పెళ్లి చేసుకుంది. దుర్గేష్ తొలుత ప్రేమగా ఉన్నట్టే కనిపించినప్పటికీ రానురానూ రాక్షసుడిగా మారాడు. దీపిక నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. భర్త దాడిలో గాయపడిన దీపిక తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అలా వెళుతున్న ఆమెను దుర్గేష్ ఇనుప రాడ్‌తో కొట్టడంతో స్పాట్‌లోనే దీపిక కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దుర్గేష్ ఇంట్లో ఉండకుండా పారిపోయాడు.

    బుధవారం సాయంత్రం.. దీపిక సోదరుడు బచ్చూలాల్ తన అక్కను పలకరించేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. డోర్ తీసి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. తన అక్కయ్య రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆ స్థితిలో ఆమెను చూసి బచ్చూలాల్ నిర్ఘాంతపోయాడు. పోలీసులకు సమాచారం అందించాడు. దీపిక హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు కొంతసేపటికి స్పాట్‌కు చేరుకున్నారు. పదునైన ఆయుధంతో దీపిక గొంతు కోసి.. చేతిపై దాడి చేసినట్టు.. తలపై రాడ్‌తో కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీపిక హత్యకు ఆమె భర్తే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

    ఇది కూడా చదవండి: Lovers: ఆగస్ట్ 3న నైట్ టైంలో లవర్‌ను కలిసేందుకు వాళ్లూరు వెళ్లాడు.. ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆగస్ట్ 8న..

    దీపిక తమ్ముడు బచ్చులాల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. తన అక్క ఆగస్ట్ 2న పుట్టింటికి వచ్చిందని.. కట్నం కోసం దుర్గేష్ వేధిస్తున్నాడని చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుందని చెప్పాడు. కానీ.. ఇంతలోనే ఇంత ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేకపోయామని దీపిక తమ్ముడు కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు దీపిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుర్గేష్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దుర్గేష్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: