హోమ్ /వార్తలు /క్రైమ్ /

Honor Killing : కుల దురహంకారం.. చెల్లెలు భర్తను దారుణంగా చంపిన అన్నలు

Honor Killing : కుల దురహంకారం.. చెల్లెలు భర్తను దారుణంగా చంపిన అన్నలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Honor Killing : పరువు కోసం కన్నకూతురి మెడలో తాళికట్టిన యువకుడ్ని దారుణంగా చంపించారు ఆమె అన్నలు. దేశంలో పరువు హత్యలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా హరియాణాలో..

పరువు కోసం కన్నకూతురి మెడలో తాళికట్టిన యువకుడ్ని దారుణంగా చంపించారు ఆమె అన్నలు. దేశంలో పరువు హత్యలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా హరియాణాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుణ్ని.. యువతి సోదరులు అతి దారుణంగా హత్య చేశారు. పానిపట్ బిజీ మార్కెట్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పరువు పేరుతో ప్రేమికుల వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయ్. ముఖ్యంగా హరియాణాలో గత వారం రోజుల్లో ఇది రెండో హత్య. వివరాల్లో కెళితే.. నీరజ్ అనే యువకుడు హరియాణాకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఒక నెలన్నరలోపే కుల దురహంకారానికి బలైపోయాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నీరజ్, తమ సోదరిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో నీరజ్‌ భార్య సోదరులు కక్ష పెంచుకున్నారు. మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు. నీరజ్‌ను కనీసం డజను సార్లు పొడిచి చంపి అక్కడినుంచి పరారయ్యారు.చాలాకాలంగా నిందితులు తన తమ్ముడిని బెదిరిస్తున్నారని, పోలీసుల రక్షణ కోరినా పట్టించుకోలేదని నీరజ్‌ సోదరుడు జగదీష్‌ వాపోయారు.

దాడికి కొన్ని నిమిషాలు ముందు నీరజ్‌ భార్యకు ఫోన్‌ చేసి మరీ త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ, పథకం ప్రకారమే తన సోదరుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీంటి పర్యంత మయ్యాడు. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించి, ఇందుకు గ్రామ పంచాయతీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపాయి, కానీ ఆ మహిళ సోదరులు అంగీకరించలేదనీ, నీరజ్‌ దంపతులపై బెదరింపులకు పాల్పడ్డారని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. పరువు కోసం కన్నకూతురి మెడలో తాళికట్టిన యువకుడ్ని దారుణంగా చంపించారు ఆమె తల్లిదండ్రులు. పట్టపగలు నడిరోడ్డుపై అల్లుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా, నందవరం మండలం, గురజాలకు చెందిన డేవిడ్ స్మిత్ అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని ఇరువురు తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. అయినా నేను డేవిడ్ స్మిత్ నే పెళ్లి చేసుకుంటానని మల్లీశ్వరి తెగేసి చెప్పడంతో తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెను గృహనిర్బంధం చేశారు. దీంతో ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు.

First published:

Tags: Crime, Crime news, Haryana, Honor Killing, Police

ఉత్తమ కథలు