మొన్నటికి మొన్న ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడాని కత్తితో అతి కిరాతంగా పొడిచి చంపింది ఓ యువతి. తాజా పెళ్లి చేసుకున్న తరువాత కాపురానికి రావడం లేదని చిత్తూరులో ప్రేమించిన యువతిని దారికాచి మరీ అతి కిరాతకంగా పొడిచి పారిపోయాడు భర్త. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తూర్పు పల్లి గ్రామానికి చెందిన గాయత్రి (19). ఈమెను పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19) రెండు నెలల క్రితం పెద్దలకు తెలియకుండా రహాస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే విషయం కాస్త ఇరు కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో పెళ్లి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది దానికి తోడు ఇద్దరు మైనర్లు కావడంతో పెనుమూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు యువతి బంధువులు.
దీంతో ఇరు వైపుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇచ్చారు పోలీసులు. పారిపోయి పెళ్లి చేసుకున్న జంటను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తరువాత యువతి, యువకుడును వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి ఢిల్లీ బాబు ఎన్ని సార్లు గాయత్రితో మాట్లాడడానికి ప్రయత్నించా ఆమె స్పందించకపోవడంతో ఆగ్రహించిన బాబు, మంగళవారం మధ్యాహ్నం పెనుమూరు వద్ద సంతకు వచ్చి తిరిగి వెళుతున్న గాయత్రిని దారి కాచి అతి కిరాతకంగా కత్తితో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న గాయత్రిని స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఢిల్లీ బాబు పై కేసు నమోదు చేశారు పరారీ లో ఉన్న బాబు కోసం గాలిస్తోన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News