హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love marriage killed family: కుటుంబాన్నే బలితీసుకున్న ప్రేమ పెళ్లి.. మొదట కొడుకు.. తర్వాత కోడలు... చివరికి తండ్రి..

Love marriage killed family: కుటుంబాన్నే బలితీసుకున్న ప్రేమ పెళ్లి.. మొదట కొడుకు.. తర్వాత కోడలు... చివరికి తండ్రి..

ఓ ప్రేమ వివాహం కుటుంబాన్నే బలితీసుకుంది. ముగ్గురు ప్రాణాలను తీసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని హాయిగా చిలకా గోరింకల్లా సంసారం చేసుకుంటారనుకుంటే పెళ్లైన కొద్ది రోజులకే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు

ఓ ప్రేమ వివాహం కుటుంబాన్నే బలితీసుకుంది. ముగ్గురు ప్రాణాలను తీసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని హాయిగా చిలకా గోరింకల్లా సంసారం చేసుకుంటారనుకుంటే పెళ్లైన కొద్ది రోజులకే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు

ఓ ప్రేమ వివాహం కుటుంబాన్నే బలితీసుకుంది. ముగ్గురు ప్రాణాలను తీసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని హాయిగా చిలకా గోరింకల్లా సంసారం చేసుకుంటారనుకుంటే పెళ్లైన కొద్ది రోజులకే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు

  ఓ ప్రేమ వివాహం (love marriage) కుటుంబాన్నే బలితీసుకుంది. ముగ్గురు ప్రాణాలను తీసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని హాయిగా చిలకా గోరింకల్లా సంసారం చేసుకుంటారనుకుంటే పెళ్లైన కొద్ది రోజులకే అబ్బాయి ఆత్మహత్య (Son suicide) చేసుకున్నాడు. కోడలి (daughter in law)పై కోపంతో మామ హత్య (Murder)కు ఉపక్రమించాడు. ఆ కొడుకు చేసిన పనితో తండ్రి (father) తనువు చాలించాడు. ఇలా ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలోనే మూడు ప్రాణాలు (Three lives) గాలిలో కలిసిపోయాయి.  మంచిర్యాల (Mancherial) జిల్లాలోని కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

  లింగన్నపేట గ్రామానికి చెందిన రాళ్లబండి రాజబాబు (Rallabandi rajababu)కి కొడుకు రాళ్లబండి తిరుపతి (Thirupati). మనవడు సాయి ఉన్నారు. అయితే మనవడు సాయి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు హాయిగానే గడిచింది. అయితే

  ఏమైందో ఏమో గానీ మూడు నెలల క్రితం తిరుపతి కొడుకు సాయి (sai) ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సాయి మృతితో అతని తండ్రి అయిన తిరుపతి కోడలిపై పగ పెంచుకున్నాడు. తన కొడుకు చావుకు ఆమె కారణమని నిత్యం రగిలిపోయాడు. ఆ కోపంతోనే నాలుగు రోజుల క్రితం కోడలి గొంతు కోసి హత్య (Murder) చేశాడు తిరుపతి. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపతి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుపతి కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

  చెరువులో రాజబాబు మృతదేహం..

  తన కొడుక్కి హత్యానేరంతో శిక్ష తప్పదని, మృతురాలి కుటుంబ సభ్యులు దాడి చేస్తారని భయపడిపోయాడు తిరుపతి తండ్రి రాజబాబు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిన రాజబాబు.. ఇవాళ గ్రామంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చెరువు నుంచి రాజబాబు మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, రాజబాబు మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇటీవలె చెన్నైలో ఇలాంటి ఘటనే జరిగింది. భట్టాపురం డ్రైవర్స్ కాలనీలో పెళ్లయిన మూడు నెలలకే భార్య ఆత్మహత్య చేసుకుంది.. చెన్నైలోని వాటర్ బోర్డ్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న అఖిలన్ అనే యువకుడికి మూడు నెలల క్రితం అన్నా నగర్‌కు చెందిన రోనీషా అనే 22 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. రోనీషా M.Com చదువుతోంది. పెళ్లి తర్వాత కూడా ఆమెను చదివించేందుకు వరుడి కుటుంబం ముందుకు రావడంతో ఆమె సంతోషంగా పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి మూడు నెలలయింది. రోనీషా మామయ్య నిన్న ఉదయం ఓ పని మీద అరక్కోణం వెళ్లాడు. రోనీషా భర్త, అత్త ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో రోనీషా ఒక్కతే ఉంది. ఇంట్లో వాళ్లు తిరిగొచ్చేసరికి రోనీషా బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.

  First published:

  Tags: Crime news, Family dispute, Mancherial

  ఉత్తమ కథలు