కలిసి బతకాలనుకున్నారు.. కానీ చివరికిలా విషాదాంతం..

సోమవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజధాని థియేటర్ సమీపంలో యువకుడు అద్దెకు ఉండే గదిలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

news18-telugu
Updated: June 25, 2019, 9:04 AM IST
కలిసి బతకాలనుకున్నారు.. కానీ చివరికిలా విషాదాంతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాళ్లిద్దరు దగ్గరి బంధువులు.. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకన్నారు. కానీ అన్నీ కథల్లో లాగే ఇక్కడ కూడా పెద్దలు అడ్డుపడ్డారు. కుదరదంటే కుదరదన్నారు.. దీంతో వారిని ఎదిరించే ధైర్యం లేక చావే శరణ్యం అనుకున్నారు.కూల్ డ్రింక్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా రాగన్నగూడకు చెందిన ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బంధువులే కావడం.. ఇద్దరి ఒకరినొకరు ఇష్టపడటం..వారిని ప్రేమలో పడేలా చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్న వీరిద్దరు.. విషయాన్ని ఇంట్లో చెప్పారు.

అయితే ఇరువురి తల్లిదండ్రులుదీనిపై పెద్ద గొడవే చేశారు. పెళ్లి కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఇద్దరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజధాని థియేటర్ సమీపంలో యువకుడు అద్దెకు ఉండే గదిలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.ఇరువురిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. ప్రస్తుతం యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు