పెద్దలు ఒప్పుకోలేదని.. రైలుకు ఎదురెళ్లి చనిపోయిన ప్రేమజంట

సోమవారం అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి రామేశ్వరం వైపుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌కి వీరిద్దరు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

news18-telugu
Updated: November 20, 2019, 9:32 AM IST
పెద్దలు ఒప్పుకోలేదని.. రైలుకు ఎదురెళ్లి చనిపోయిన ప్రేమజంట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కంలో విషాదం చోటు చేసుకుంది.స్వాతి(22),మదన్(22) అనే ప్రేమ జంట రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దలు vవీరి ప్రేమను తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరు బంధువులే అయినప్పటికీ..పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో కలిసి బతకలేమని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. స్వాతి(22) నర్సింగ్ చదువుతోంది. మదన్ (22) స్థానికంగా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.ఇద్దరు బంధువులే కావడంతో ఒకరి ఇంటికి ఒకరు తరుచూ వస్తూ వెళ్తుండేవారు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.మదన్.. స్వాతిని బైక్‌పై కాలేజీకి తీసుకెళ్లడం.. తిరిగి ఇంటికి తీసుకురావడం చేస్తుండేవాడు. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పగా.. పెద్దలు తిరస్కరించారు. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి రామేశ్వరం వైపుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌కి వీరిద్దరు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరుసటిరోజు ఉదయం పోలీసులు.. మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com