వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. పెద్దలకు చెబితే అంగీకరించరేమోనని అనుకున్నారు.. బతికి విడిపోలేక.. కలిసే చావాలని నిర్ణయించుకున్నారు.. ఇద్దరు కలిసి ఎవరూ లేని చోట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్త సార్సాల గ్రామానికి చెందిన యువతి, బిబ్రా గ్రామానికి చెందిన దుర్గం సంతోష్ ప్రేమించుకున్నారు. కొంతకాలం కలిసి తిరిగారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని భయపడ్డారు. బతికి విడిపోయేకన్నా.. కలిసి చనిపోవాలని నిశ్చయించుకొన్నారు. ఉగాది పండుగనాడే.. కాగజ్నగర్ మండలం అంకుశాపూర్ అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అటుగా వచ్చిన పశువుల కాపరులు వారి మృతదేహాలను చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.