మెదక్‌లో దారుణం.. రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట ఆత్మహత్య

మృతులని మొదట భార్యాభర్తలని భావించారు. కానీ దర్యాప్తులో ఆమె రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి కనబడకుండా పోయిన మల్కాజ్‌గిరికి చెందిన సంతోషినిగా గుర్తించారు.

news18-telugu
Updated: May 19, 2020, 7:13 PM IST
మెదక్‌లో దారుణం.. రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట ఆత్మహత్య
ప్రతీకాత్మ చిత్రం
  • Share this:
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వేగంగా వస్తున్న రైలుకు ఎదురువెళ్లడంతో.. ఇంజిన్ ఢీకొని చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన సంతోషిని అనే యువతి రెండు రోజులుగా కనిపించడం లేదని మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదయింది. ఐతే ఇతే రోజు మాసాయిపేటలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు మొదట భార్యాభర్తలని భావించారు. కానీ దర్యాప్తులో ఆమె రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి కనబడకుండా పోయిన మల్కాజ్‌గిరికి చెందిన సంతోషినిగా గుర్తించారు.

ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, 2014 జులైలో ఇదే రైల్వేష్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. నాటి ఘటనలో 16 మంది విద్యార్థులు మరణించారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవడం వల్లే ఘోర ప్రమాదం జరిగింది.

First published: May 19, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading