పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో విషాదం చోటు చేసుకుంది. తనకంటే పదేళ్లు పెద్దదైన నాగమణి అనే ఒంటరి మహిళను ఇష్టపడ్డ సురేష్ అనే యువకుడు.. పెద్దల తిరస్కారంతో మనస్తాపానికి గురయ్యాడు. కలిసి జీవించడం ఇక కలనే అని భావించి నాగమణితో కలిసి తమ్మిలేరు రిజర్వాయరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అక్కడే ఉన్న కొంతమంది మత్స్యకారులు రిజర్వాయరులో దూకిన నాగమణిని కాపాడగలిగారు. సురేష్ మాత్రం అప్పటికే గల్లంతయ్యాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. నాగమణి సురేష్ మధ్య కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారు.వివాహిత అయిన నాగమణి భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం సురేష్ ఆమెకు దగ్గరయ్యాడు. తోడుగా ఉంటానని.. ఆమె బిడ్డకు తండ్రి లేని లోటు తీరుస్తానని చెప్పాడు.దీంతో అతని ప్రేమకు నాగమణి ఒప్పుకుంది. అయితే సురేష్ కంటే ఆమె పదేళ్లు పెద్దది కావడం.. బిడ్డ కూడా ఉండటంతో అతని కుటుంబ సభ్యులు ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సురేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరు శనివారం కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ వద్దకు వెళ్లారు.రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యకు యత్నించారు. అయితే అక్కడే ఉన్న మత్స్యకారులు నాగమణిని కాపాడారు. సురేష్ మాత్రం గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతనికోసం గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. సురేష్ గల్లంతవడంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.