కోల్‌కతాలో మొదలైంది.. హైదరాబాద్‌లో విషాదాంతమైంది.. ఫేస్‌బుక్ ప్రేమ కథ..

పంజాబ్ నుంచి తిరిగి కోల్‌కతా చేరుకున్న ఈ జంట అక్కడ కొంతకాలం ఉన్నారు. హైదరాబాద్‌లో సెటిల్ అవాలనే ఆలోచనతో కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. వనస్థలిపురం పరిధిలో ఉన్న ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

news18-telugu
Updated: May 9, 2019, 8:17 AM IST
కోల్‌కతాలో మొదలైంది.. హైదరాబాద్‌లో విషాదాంతమైంది.. ఫేస్‌బుక్ ప్రేమ కథ..
ప్రతీకాత్మక చిత్రం (Image: REUTERS)
  • Share this:
ఫేస్‌బుక్‌లో పరిచయం వారిద్దరిని దగ్గర చేసింది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో కలిసి బతకాలనుకున్నారు. అందుకు వయసు, వారి నేపథ్యం.. ఇవేవి అడ్డు కాలేదు. అయితే కలిసి బతకడం మొదలుపెట్టిన తర్వాతే మనస్పర్థలు మొదలయ్యాయి. అతనికి ఆమెపై అనుమానం ఏర్పడి దాడి చేసేదాకా వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది. అలా కోల్‌కతాలో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. హైదరాబాద్‌లో విషాదాంతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన సంగీత ముఖర్జీ (43), పంజాబ్‌కి చెందిన లోకేశ్‌ (25)లకు కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఆమె.. భర్తతో విడాకులు పొంది ఒంటరిగా ఉంటోంది. లోకేశ్‌తో తన ఆలోచనలు కలవడంతో.. ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నారు. ఆ క్రమంలో ఏడాది క్రితం సంగీత పంజాబ్ వెళ్లి మొదటిసారి లోకేశ్‌ను కలిసి.. మూడు నెలలే అక్కడే గడిపింది.

పంజాబ్ నుంచి తిరిగి కోల్‌కతా చేరుకున్న ఈ జంట అక్కడ కొంతకాలం ఉన్నారు. హైదరాబాద్‌లో సెటిల్ అవాలనే ఆలోచనతో కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. వనస్థలిపురం పరిధిలో ఉన్న ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఇటీవల సంగీత వేరేవాళ్లతో చాటింగ్ చేస్తోందని లోకేశ్ ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం వేరే స్నేహితుని ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సంగీత హోటల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయాన్నే వచ్చిన సిబ్బంది గది తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూసేసరికి సంగీత ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. అయితే సంగీత చాట్ చేసిన వ్యక్తి లోకేశ్ స్నేహితుడే అని.. అతనూ కోల్‌కతాకు చెందినవాడేనని పోలీసులు గుర్తించారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలు చివరకు ఆమె ఆత్మహత్యకు దారితీశాయన్నారు.
First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading