• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LOUNGE MANAGER AT DELHI AIRPORT ARRESTED IN SEXUAL HARASSMENT CASE BN

గదికి రావాలంటూ ఉద్యోగినికి వేధింపులు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు మేనేజర్ అరెస్టు..

గదికి రావాలంటూ ఉద్యోగినికి వేధింపులు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు మేనేజర్ అరెస్టు..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ నేపథ్యంలో ఆమె ప్రత్యేకంగా డ్యూటీలు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లైంగికంగా సహకరించపోతే డ్యూటీని తొలగిస్తామని బెదిరించారు.

  • Share this:
    ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ మేనేజర్ తన కింద పనిచేసే ఉద్యోగినిపై కన్నేశాడు. తన సహోద్యోగితో కలిసి ఆ ఉద్యోగినికి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధిస్తూ లొంగకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాలంటూ బెదిరింపులకు దిగాడు. తీరా ఆ ఉద్యోగిని ఎదురుతిరగడంతో కటకటలాపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3లోని లాంజ్‌లో ఓవ్యక్తి(42) జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే విమానాశ్రయంలో ఫుడ్ అండ్ బేవరేజస్ అసిస్టెంట్‌గా ఓ 26 ఏళ్ల మహిళ పనిచేస్తుంది. అయితే ఆ మహిళపై మేనేజర్ కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు పలురకాలుగా లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడు. మేనేజర్ ఆ ఉద్యోగిని లొంగదీసుకునేందుకు అక్కడే పనిచేసే డ్యూటీ మేనేజర్ సాయంతో ఇబ్బందులు పెట్టాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆమె ప్రత్యేకంగా డ్యూటీలు చేయాల్సి వచ్చింది.

    ఆ సమయంలో లైంగికంగా సహకరించపోతే డ్యూటీని తొలగిస్తామని బెదిరించారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆమెను ప్రత్యేక గదికి రావాలంటూ పలుమార్లు అడిగారు. గత ఆరు నెలలుగా ఇలాంటి వేధింపులు ఎన్నో ఎదుర్కొన్నానని ఆ ఉద్యోగిని తెలిపింది. అనేక సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అనుచితంగా తాకారని పేర్కొంది. దీంతో విసిగిపోయిన ఆ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జనరల్ మేనేజర్‌తో పాటు డ్యూటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుంటే.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం గమనార్హం.
    Published by:Narsimha Badhini
    First published: