Kabul hotel attack : అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్(Kabul)లోని ఓ హోటల్‌లో సోమవారం (డిసెంబర్ 12) మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. షేర్‌నౌ ప్రాంతంలోని హోటల్ "స్టార్-ఎ-నౌ"పై దుండగులు సాయుధ దాడికి పాల్పడ్డారని పేలుడు సంభవించిన తర్వాత తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు తెలిపారు. చైనా వ్యాపారవేత్తలు ఈ హోటల్ కి ఎక్కువగా వచ్చేవారని సమాచారం. దాడి చేసిన వ్యక్తులు ఇప్పటికీ హోటల్ భవనంలోనే ఉన్నారని నివేదికలు తెలిపాయి.
An explosion has taken place in Kabul where the #Chinese were living . pic.twitter.com/4IU6KAEE23
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) December 12, 2022
అప్ఘానిస్తాన్ కు చెందిన టోలోన్యూస్ మాజీ జర్నలిస్ట్ అదుల్హక్ ఒమేరి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో దాడికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలలో...హోటల్ భవనం నుండి మంటలు, దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్నట్లు కనబడుతోంది. తాలిబాన్ భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Crime news, Kabul blast