ప్రాణంతీసిన పార్కింగ్ వివాదం... లాటరీల డీలర్ హత్య...

Lottery dealer Murder : నిన్ను చంపుతా... అంటూ కత్తి కోసం తన ఇంటికి వేగంగా వెళ్లాడు. అతని వెంట విను కూడా వెళ్లాడు. కత్తికోసం వెతుకుతుండగా... తన ముగ్గురు సిబ్బందితో ఇంట్లోకి వచ్చాడు సంజు. సరిగ్గా అప్పుడే రాజన్ చేతికి కత్తి చిక్కింది. ఆ తర్వాత...

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 11:29 AM IST
ప్రాణంతీసిన పార్కింగ్ వివాదం... లాటరీల డీలర్ హత్య...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Thrissur : శత్రు శేషం ఉండకూడదన్నది అపర చాణక్యుడి సిద్ధాంతాల్లో ఒకటి. ఎందుకంటే శత్రువు ఎప్పటికైనా ప్రమాదమే. కానీ... శత్రువు లేకపోయినా ప్రమాదం ఉంటుందని నిరూపించింది ఈ ఘటన. కేరళలోని త్రిచూర్‌లో జరిగింది. రాజన్... ఓ లాటరీల డీలర్. తమిళనాడులో... చాలా షాపులకు అక్రమంగా లాటరీలు అమ్ముతూ ఉంటాడు. అతని మేనల్లుడు వినుకి ఈ కేసుతో కీలక పాత్ర ఉంది. లాటరీల డీలర్ ఇంటికి దగ్గర్లోనే మప్పారన్ వర్ణ థియేటర్ ఉంది. ఈ హాల్‌కి వచ్చిన ప్రేక్షకులు... తమ వెహికిల్స్‌ని థియేటర్ పక్కనే ఉన్న రోడ్డుపై పార్క్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి రాజన్ ఇంటి ముందు కూడా వెహికిల్స్ పార్క్ చేస్తారు. దీనిపై చాలాసార్లు థియేటర్ ఓనర్‌కి చెప్పినా ఫలితం లేకపోవడంతో... ఇటీవలే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు రాజన్. ఆ కేసు దర్యాప్తులో ఉంది. దీనిపై థియేటర్ ఓనర్ చాలా కోపంగా ఉన్నాడు.

తాజాగా... సెకండ్ షో సినిమాకి వచ్చిన ప్రేక్షకులు తమ వాహనాల్ని... రాజన్ ఇంటి ముందు కూడా పార్క్ చేశారు. ఇంతలో రాజన్ మేనల్లుడు విను... రాజన్ ఇంటికి వచ్చాడు. తన బైక్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ లేకుండా పోయింది. "ఏంటి మావయ్యా అది... మీ ఇంటికి ఎప్పుడొచ్చినా... పార్కింగ్ సమస్యే" అంటూ చిరాకుపడ్డాడు. రాజన్‌కి పిచ్చి కోపం వచ్చింది. తిన్నగా వెళ్లి... థియేటర్‌లో ఉన్న మేనేజర్ సంజుతో గొడవపడ్డాడు. నిన్ను చంపుతా... కత్తి తెస్తా అంటూ తన ఇంటికి వేగంగా వెళ్లాడు. అతని వెంట విను కూడా వెళ్లాడు. కత్తికోసం వెతుకుతుండగా... తన ముగ్గురు సిబ్బందితో రాజన్ ఇంట్లోకి వచ్చాడు సంజు. సరిగ్గా అప్పుడే రాజన్ చేతికి కత్తి చిక్కింది. ఐతే... తన సిబ్బందితో రాజన్‌ను అడ్డుకున్న సంజు... కత్తిని లాక్కున్నాడు. అదే కత్తితో రాజన్‌ను కసాకసా పొడిచాడు. "అమ్మో" అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న విను తలపై బీర్ బాటిల్‌తో కొట్టారు. తర్వాత అక్కడి నుంచీ పారిపోయారు.

విపరీతంగా రక్తం కారడంతో... కొన్ని క్షణాలు విలవిలలాడి ప్రాణాలు విడిచాడు రాజన్. థియేటర్ ఓనర్ ఇంత పనిచేస్తాడని ముందుగా ఊహించని పోలీసులు... పార్కింగ్ వివాదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. తీరా రాజన్ ప్రాణాలు పోయాక... ఇప్పుడు కంగారుపడుతున్నారు. పారిపోయిన సంజు, అతని సిబ్బందిని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading