news18-telugu
Updated: November 15, 2020, 5:35 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ లారీ డ్రైవర్ తనతోపాటు పనిచేస్తున్న క్లీనర్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇనుపరాడ్‌తో కొట్టి ప్రాణాలు తీశాడు. అనంతరం క్లీనర్ శవంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ జిల్లా కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ నైపు రాజు, క్లీనర్ రాజులు నూకల లోడు కోసం లారీలో కరీంనగర్‌కు వచ్చారు. అయితే కరీంనగర్ నుంచి తిరుగి వెళ్లేటప్పుడు.. లోడుకు పట్టా కట్టే విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే డ్రైవర్ రాజు క్లీనర్‌పై దాడి చేశాడు. క్లీనర్ ను ఇనుపరాడుతో కొట్టి కత్తితో పొడిచాడు. అయితే క్లీనర్‌ను హత్య చేసిన డ్రైవర్ రాజు.. అతడి మృతదేహం లారీలో వేసుకుని కాకినాడకు బయలుదేరాడు.
క్లీనర్ శవంతోనే కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు ప్రయాణించాడు. అయితే ఖమ్మం దాటగానే కొణిజర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. లారీలో మృతదేహంతో నిందితుడు పోలీసు స్టేషన్‌కు వచ్చేసరికి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. అయితే తన ప్రాణాలను కాపాడుకోవడానికే తాను క్లీనర్ రాజును చంపినట్టు డ్రైవర్ నైపు రాజు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీని క్షుణంగా తనిఖీ చేశారు. క్లీనర్ రాజు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 15, 2020, 5:33 PM IST