Home /News /crime /

లారీ డ్రైవర్ అతి తెలివి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు

లారీ డ్రైవర్ అతి తెలివి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు

నిందితుడు శంకర్‌ను పట్టుకున్న పోలీసులు

నిందితుడు శంకర్‌ను పట్టుకున్న పోలీసులు

Singareni Jobs: ఏం చేయాలి సుదీర్ఘంగా ఆలోచించి ఈజీ గా డబ్బులు సంపాదించాలని అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేశాడు.

  ఇతని పేరు శంకర్. తనో ప్రైవేట్ లారీ డ్రైవర్. లారీ యజమాని ఇచ్చే డబ్బులు సరిపోలేదు కావచ్చు. లారీ డ్రైవర్ ఓనర్ కావద్దా అనుకున్నాడేమో. మరి ఏం చేయాలి సుదీర్ఘంగా ఆలోచించి ఈజీ గా డబ్బులు సంపాదించాలని అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. తనకు సింగరేణిలో బడాబాబులతో పరిచయాలు ఉన్నాయని చెప్పటం మొదలు పెట్టాడు. 2018 సంవత్సరం నుంచి సింగరేణిలో ఉద్యోగాలు పెట్టిస్తాను అని మాయ మాటలు చెప్పి శ్రీరామ్ సారయ్య నుంచి రూ.11,00,000/- తీసుకొని మోసం చేశాడు. సారయ్య లాంటి ఇంకా ఎంతో మంది శంకర్ వలలో ఉన్నట్లు సమాచారం. సారయ్య, శంకర్ ను ఉద్యోగం గురించి అడిగినప్పుడల్లా ఇవ్వాళ, రేపు అని నమ్మిస్తూ రెండు సంవత్సరాల పాటు కాలం వెళ్లదీశాడు శంకర్. చేసేది ఏమీ లేక సారయ్య పోలీసులను సంప్రదించడంతో అసలు రంగు బయట పడ్డది. సారయ్య లాంటి చాలా మంది నిరుద్యోగ యువకుల నుంచి అందినకాడికి దోచుకున్నాడు శంకర్.

  నిన్న గోదావరిఖని టూ టౌన్ పోలీసులకు సమాచారం రావడంతో చాకచక్యంగా నేరస్తుడు అయిన రాగులపల్లి శంకర్ ను పట్టుకున్నారు. గోదావరిఖని టూ టౌన్ పోలీసుల విచారణలో నేరస్తునిపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా మోసం చేసిన కేసు నమోదు అయిందని తెలిసింది. శంకర్ తన నేరాన్ని ఒప్పుకోగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని 2టౌన్ సీఐ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తూ అమాయకులను మోసం చేసే వారి మాయమాటలు నమ్మి డబ్బు, సమయం నష్ట పోవద్దని సూచించారు. అలాంటి మోసగాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు పెట్టిస్తామని చెబితే వారి సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు. ఉద్యోగాలు పెట్టిస్తామని మోసం చేసిన వారిపై PD యాక్ట్ కూడా నమోదు చేస్తామని, ఇప్పటికే పలువురు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టామని తెలిపారు.

  ఈ ఏడాది జూన్‌లో సింగరేణి ఉద్యోగం కోసం ఏకంగా కుటుంబసభ్యులే తండ్రిని అంతం చేశారు. బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి (56) సింగరేణి కాలరీస్ గని కార్మికుడు. శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్‌కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంకరికి, అతని కుటుంబ సభ్యులకు నిత్యం గొడవలు జరిగేవి. కుటుంబం నుంచి విడిపోయిన శంకరి మంచిర్యాలలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మరో రెండు సంవత్సరాల్లో శంకరి ఉద్యోగ విరమణ పొందనున్నాడు. దీంతో అతడి ఉద్యోగం తన కుమారుడికి కారుణ్య నియామకం కింద ఇప్పిస్తే మంచిదని అనుకుంది భార్య విజయ. ఇందుకోసం తన భర్తను అడ్డు తొలిగిస్తే మంచిదని కుట్ర పన్నింది. అనుకున్నదే తడవుగా భార్య విజయ వెంటనే తన భర్త శంకరికి ఫోన్‌ చేసింది. కూతురుకి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆరోగ్యం అస్సలు బాలేదని ఇంటికి రావాలని కోరింది. దీంతో శంకరి వెంటనే ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి నిద్రిస్తుండగా భార్య విజయ తన ప్లాన్ అమలుచేసింది. కూతురు స్వాతి, కుమారుడు శ్రావణ్‌ కుమార్‌ సహాయంతో శంకరి మెడకు చీరతో బిగించి అతడిని హత్య చేశారు. ఆ తర్వాత ఉరి వేసుకొని అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానంతో కుటుంబీకులను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Singareni Collieries Company, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు