అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ప్రస్తుతం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షతగాత్రుల నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

news18-telugu
Updated: April 12, 2019, 2:51 PM IST
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 12, 2019, 2:51 PM IST
అనంతపురం జిల్లా ఎర్రగుంటపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సును కంటైనర్ లారీ వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో.. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తనకల్లు మండలానికి చెందిన కాటేపల్లి దస్తగిరి(50), ఖాదర్ భాషా(45),శివ నాగేష్(30), డేరంగుల పార్వతమ్మ (42), పెద్దపల్లి మున్నా (50)లుగా గుర్తించారు. ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని కదిరిలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.లారీ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షతగాత్రుల నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...