రైలును ఆపి మరీ.. ఇంజిన్ ముందు మూత్ర విసర్జన చేశాడు..

రెడ్ సిగ్నల్ గానీ, సాంకేతిక లోపం గానీ తలెత్తకున్నా రైలును ఆపేశాడు. దిగేసి ఇంజిన్ ముందుకు వచ్చి పట్టాలపైనే ఆ పని కానిచ్చేశాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 18, 2019, 4:07 PM IST
రైలును ఆపి మరీ.. ఇంజిన్ ముందు మూత్ర విసర్జన చేశాడు..
ట్రైన్ ముందే మూత్ర విసర్జన చేస్తన్న డ్రైవర్
  • Share this:
అతడు రైలు లోకోపైలట్.. ముంబై లోకల్ ట్రైన్‌కు డ్రైవర్.. ఉల్లాస్‌నగర్ నుంచి ముంబై వైపు వెళ్లే రైలును నడుపుతున్నాడు.. అనుకోకుండా ప్రకృతి పిలిచింది.. మూత్రం పోయాల్సిన పరిస్థితి.. రైల్లో పనికానిచ్చేద్దామనుకుంటే లోకల్ రైళ్లలో మూత్రశాలలు ఉండవాయే. మరి ఏం చేయాలి? వచ్చే స్టేషన్ వరకు ఆగాల్సి వస్తుంది. అప్పటి వరకు ఆపుకోవడం కష్టం అనుకున్న ఆ డ్రైవర్ ఓ ఆశ్చర్యకర పని చేశాడు. రెడ్ సిగ్నల్ గానీ, సాంకేతిక లోపం గానీ తలెత్తకున్నా రైలును ఆపేశాడు. దిగేసి ఇంజిన్ ముందుకు వచ్చి పట్టాలపైనే ఆ పని కానిచ్చేశాడు. బుధవారం చోటుచేసుకున్న ఈ సన్నివేశాన్ని సుశీల్ షిండే అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


అయితే, వీడియో నిజమైనదో కాదో అని తెలుసుకునేందుకు రైల్వే అధికారులు పరీక్షలు చేపట్టారు. వీడియో నిజమని తేలితే ట్రైన్ డ్రైవర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి లోకోపైలట్‌లు ఇలా ఇబ్బంది పడితే, ముందు వచ్చే మేజర్ స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తారు. అదే సబ్ అర్బన్ ట్రైన్లలో అలాంటి అవకాశం లేదు. ట్రిప్ పూర్తయ్యాకే మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి. అందువల్లే ఆ డ్రైవర్ రైలును ఆపి మూత్ర విసర్జన చేసి ఉంటాడు.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు