ఆమెపై మృగాడిలా విరుచుకుపడ్డాడు.. మైనర్‌ను చితకబాది.. పలుమార్లు రేప్ చేసిన భర్త

బలవంతంగా ఆమెతో శృంగారం చేశాడు.. వద్దని ప్రాధేయపడితే.. ఓ గదిలో బంధించి దారుణంగా చితకబాదాడు. ఎట్టకేలకు ఆ నరకం నుంచి బయటపడి పోలీసుల చెంతకు చేరి తన గోడును వెళ్లబోసుకుంది.

news18-telugu
Updated: May 3, 2019, 11:56 AM IST
ఆమెపై మృగాడిలా విరుచుకుపడ్డాడు.. మైనర్‌ను చితకబాది.. పలుమార్లు రేప్ చేసిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆ మైనర్ బాలిక పేరు సుకన్య(పేరు మార్చాం).. తల్లిదండ్రులు లేరు.. అమ్మమ్మ వద్దే జీవనం.. చదువుకుందామంటే డబ్బులు లేవు.. దిక్కు తోచని స్థితి.. అప్పుడే బాలిక మేనమామ, మేనత్త కలిసి ఓ ప్రతిపాదన తెచ్చారు. బాగా చదువుకోవడానికి, ఆర్థికంగా బలపడటానికి తెలిసిన ఓ పెద్దాయనకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఆ బాలిక ఒప్పుకోలేదు. అయినా, బలవంతపెట్టి పెళ్లి చేశారు. కనీసం బాగా చదువుకోవచ్చులే అనుకుంది.. కానీ, ఆ నీచుడు ఆ అమాయకురాలిపై మృగాడిలా వ్యహరించాడు. బలవంతంగా ఆమెతో శృంగారం చేశాడు.. వద్దని ప్రాధేయపడితే.. ఓ గదిలో బంధించి దారుణంగా చితకబాదాడు. ఎట్టకేలకు ఆ నరకం నుంచి బయటపడి పోలీసుల చెంతకు చేరి తన గోడును వెళ్లబోసుకుంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం పూణెలోని బిబ్వేవాడికి చెందిన ఆమె భర్తకు ఇది వరకే రెండుసార్లు పెళ్లయ్యింది. వారిద్దరూ మైనర్లే. అతడు పెట్టే శారీరక, మానసిక హింసను తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయారు. ‘నా జీవితాన్ని ఆ నరకంలోనే నెట్టుకురావాల్సి వస్తుందనుకున్నా. మా మేనమామ వచ్చినా నా భర్త ఆయన్ను ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. ధైర్యం తెచ్చుకొని ఒక రోజు మేనమామతో ఫోన్‌లో నా గోడును చెప్పుకున్నా. ఆ సమయంలో మా అత్తమ్మ చూసి ఫోన్ లాక్కొని, దారుణంగా కొట్టింది. ఆ ఘటన తర్వాత మా మేనమామ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు’ అని సుకన్య చెప్పుకొచ్చింది. తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన బాధితురాలు న్యాయం కోసం ఎదురు చూస్తోంది.
First published: May 3, 2019, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading