పబ్‌జీ గేమ్ మోజులో పడి తాత పెన్షన్ సొమ్ము నుంచి రూ.2 లక్షలు..

పబ్‌జీ ఆడడం కోసం రెండు నెలల్లో తన తాత అకౌంటు నుంచి 30 లావాదేవీల రూపంలో రూ.2 లక్షలు కాజేశాడు. అయితే పబ్‌జీ గేమ్ కోసం ఎవరికీ తెలియకుండా సిమ్ కార్డును ప్రత్యేకంగా తీసుకున్నాడు.

news18-telugu
Updated: July 8, 2020, 10:25 AM IST
పబ్‌జీ గేమ్ మోజులో పడి తాత పెన్షన్ సొమ్ము నుంచి రూ.2 లక్షలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పబ్‌జీ.. ఈ పేరు వినగానే కొంతమందికి పూనకం వచ్చేస్తుంది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా పబ్‌జీకి వ్యసనపరులు అవుతున్నారు. ఈ గేమ్ మాయలో పడి రూ.లక్షలు తృణప్రాయంగా పొగొట్టుకున్నవారు అనేకమంది ఉన్నారు. ఆ క్రమంలోనే ఇటీవల ఓ కుర్రాడు పబ్‌జీ గేమ్ కోసం రూ.16 లక్షలు తన తండ్రి ఖాతా నుంచి కాజేసిన ఘటన మరిచిపోకముందే మరో కుర్రాడు రూ.2 లక్షలు దోచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహలీకి చెందిన 15 సంవత్సరాల కుర్రాడు జనవరిలో పబ్‌జీ గేమ్ ఆడడం ప్రారంభించాడు. క్రమంగా పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిపోయాడు. ఈ క్రమంలో పబ్‌జీ ఆడడం కోసం రెండు నెలల్లో తన తాత అకౌంటు నుంచి 30 లావాదేవీల రూపంలో రూ.2 లక్షలు కాజేశాడు. అయితే పబ్‌జీ గేమ్ కోసం ఎవరికీ తెలియకుండా సిమ్ కార్డును ప్రత్యేకంగా తీసుకున్నాడు.

అయితే ఇటీవల ఆ కుర్రాడి తాత బ్యాంకు స్టేట్‌మెంట్ చూసుకుని అవాక్కయ్యాడు. ఆరా తీస్తే అప్పుడు కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. తాత పెన్షన్ ఖాతా ద్వారా పబ్‌జీ గేమ్ కోసం రూ.2 లక్షలను 30 లావాదేవీలను జరిపాడు. ఆ బాలుడితో చదివే ఓ సీనియర్ ఇన్‌యాప్ పర్చేజ్‌లను తాత పేటీఎం ఖాతా నుంచి చేయాలని సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 8, 2020, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading