హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video : భర్తను నిద్రపుచ్చి బాయ్‌ఫ్రెండ్‌ని కలిసింది..తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూడండి

Viral Video : భర్తను నిద్రపుచ్చి బాయ్‌ఫ్రెండ్‌ని కలిసింది..తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video Viral: వివాహం చేసుకున్న ఆమెకు..పెళ్లి కాని ఆ కుర్రాడంటే ఎంతో ఇష్టం. అతడికి కూడా ఆమె నచ్చింది. ఇద్దరూ కలిసి గుట్టుచప్పుడు కాకుండా కలుస్తూ ఉన్నారు. విషయం ఊరి జనం చూశారు. అంతే భర్తకు చెప్పారు. అతనేం చేశాడో ఈ వీడియోలో చూడండి.

ఇంకా చదవండి ...

వివాహేతర సంబంధం(Extramarital affair)ఎంత దాచి పెట్టాలన్నా దాగదు. ఏదో ఒకరోజు..ఎవరో ఒకరి కంట పడాల్సిందే. రాజస్ధాన్‌(Rajasthan)లో అదే జరిగింది. వివాహం చేసుకొని భర్తకు తెలియకుండా మరో యువకుడితో తిరుగుతున్న మహిళను గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తప్పు చేసిన ఇద్దర్నీ పట్టుకొచ్చి చెట్లకు కట్టేసి చితకబాదారు. ఇప్పుడు ఆ వీడియో(Video)నే సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్(Viral) అవుతోంది. మరోవైపు ఇంతటి దారుణం జరుగుతుంటే పోలీసులు(Police) ఏం చేస్తున్నారనే విమర్శలు రావడంతో వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

Viral Video : సముద్రంలో న్యూక్లియర్ బాంబ్ పేలుడు..అగ్నిపర్వతం లావాలా ఆకాశంపైకి నీరు!చాటు మాటు వ్యవహారం..

రాజస్థాన్‌ బన్స్వరా జిల్లాలోని ఘటోల్‌ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త, కుటుంబ సభ్యులకు తెలియకుండా అతడితో మాట్లాడటం, తరచూ శారీరకంగా కలుస్తూ వచ్చింది. ఇదే విషయం గ్రామస్తులకు తెలియడంతో మహిళ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి 12గంటల సమయంలో వివాహిత యువకుడిని కలిసేందుకు ఎవరూ చూడని ఏకాంత ప్రదేశానికి వెళ్లింది.


నైట్‌ టైమ్‌లో పనిష్మెంట్..

గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు వాళ్లిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జీపులో ఇద్దర్ని ఎక్కించుకొని తీసుకొచ్చారు. తమ ఇంటి ఆవరణలో మహిళలను ఒక చెట్టుకు, యువకుడ్ని మరో చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఇద్దర్ని విచక్షారహితంగా కర్రలతో కొట్టారు. సదరు వివాహిత కొట్టవద్దంటూ ఏడుస్తున్నా వినిపించుకోకుండా కుటుంబ సభ్యులు ఆమెను దారుణంగా కొట్టారు. యువకుడ్ని కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దర్ని పట్టుకొని కొడుతుండగా గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

Cheating couple : భర్త బిల్డప్ చూపించి భార్య బిజినెస్ .. 30కోట్లకుపైగా సంపాధించారు..వాళ్లేం చేశారో తెలుసాకుటుంబ సభ్యులపై కేసు..

మహిళను, యువకుడ్ని చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చివరకు పోలీసులకు చేరాయి. దీంతో ఘటోల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత, యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన వ్యక్తిపై నేరం మోపారు. తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ..ఇలా శిక్షించే అర్హత లేదని పోలీసులు తెలిపారు. యువతి, యువకుడ్ని విచారించిన తర్వాత వాస్తవాలు తెలుసుకొని నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. వీడియోలు మాత్రం ఇంకా నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

First published:

Tags: Extra marital affair, Rajasthan, Viral Video

ఉత్తమ కథలు