యువతికి మాయమాటలు చెప్పి మోసం.. యువకుడికి చెప్పులతో దేహశుద్ధి

కీర్తి తల్లి ప్రసాద్‌ను చెప్పులతో కొడుతూ విరుచుకుపడ్డారు. తమ బిడ్డను అప్పగించేదాకా నిన్ను వదిలేది లేదంటూ రోడ్డుపైనే కట్టేశారు.

news18-telugu
Updated: September 7, 2020, 5:23 PM IST
యువతికి మాయమాటలు చెప్పి మోసం.. యువకుడికి చెప్పులతో దేహశుద్ధి
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter)
  • Share this:
యువతికి మాయ మాటలు చెప్పి వలలో వేసుకుంటాడు. విలువైన కానుకలు, సెల్‌ఫోన్ల ఆశజూపి వశపర్చుకుంటాడు. ఇదే అతడి డ్యూటీ. యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అతడిని నడిరోడ్డుపై పట్టుకొని చెప్పులతో కొట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతికి.. రేగళ్ల ప్రాంతానికి చెందిన రాపర్తి ప్రసాద్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు చాలా పెద్దోళ్లు తెలుసని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెను వెంటతీసుకెళ్లాడు. కానీ రోజులు గడుస్తున్నా ఆమెను తీసుకురాలేదు.

ఆ తర్వాత ఆమె ఎక్కడుందో చెప్పలేదు. తమ బిడ్డ ఏమైందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో  సోమవారం మధ్యాహ్నం పాల్వంచలోని నటరాజ్‌ సెంటర్‌లో ప్రసాద్‌ తారసపడ్డాడు. దీంతో వెంటనే అతన్ని పట్టుకుని రోడ్డు మీదే చితక్కొట్టారు. కీర్తి తల్లి ప్రసాద్‌ను చెప్పులతో కొడుతూ విరుచుకుపడ్డారు. తమ బిడ్డను అప్పగించేదాకా నిన్ను వదిలేది లేదంటూ రోడ్డుపైనే కట్టేశారు.  అక్కడ గుమిగూడిన వారంతా తలా ఒక చేయి వేశారు. అమాయకంగా ఉండే యువతులకు ఇలా విలువైన కానుకలు, సెల్‌ఫోన్ల ఆశ చూపి వశపర్చుకుంటున్నారని ఆరోపిస్తూ చితక్కొట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 7, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading