Home /News /crime /

LOCALS BEAT UP A YOUNG MAN WHO ATTACKED A GIRL IN MANCHIRYALA DISTRICT SNR ADB

Crime News : మంచిర్యాల జిల్లాలో పోకిరోడికి దేహశుద్ధి .. అమ్మాయి ఇంటికి నైట్ వెళ్లినందుకే

అమ్మాయి వెంటపడితే..

అమ్మాయి వెంటపడితే..

Manchiryala: అమ్మాయి వెంటపడితే ఎలా ఉంటుందో ఆ యువకుడికి రుచి చూపించారు. ఒంటరిగా షాపుకు వెళ్తున్న ఓ యువతిని ఫాలో అవుతూ టార్చర్ పెడుతున్న పోకిరోడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అమ్మాయితో చెప్పు దెబ్బలు కొట్టించి పోలీసులకు అప్పగించారు. మంచిర్యాల జిల్లాలో ఈఘటన జరిగింది.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు అవకాశంగా మార్చుకుంటున్నారు పోకిరోళ్లు. ఎక్కడ ఎదురుపడినా వాళ్లను మానసీకంగా, శారీరకంగా, మాటలతో వేధిస్తూ వెంబడిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నగరాలు, టౌన్‌లలో సోషల్ మీడియా(Social media) ద్వారా ఆడపిల్లల్ని టార్చర్(Torture)పెడుతుంటే ..గ్రామాలు, పట్టణాల్లో ప్రేమ, పెళ్లి పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మంచిర్యాల(Manchiryala) జిల్లాలో ఓ యువతి వెంటబడి దాడి చేసిన ఓ పోకిరోడికి స్థానికులు తగిన గుణపాఠం చెప్పారు.

    ఇది చదవండి: వివాహేతర సంబంధం పెట్టుకున్న వృద్ధుడి హత్య ..మంత్రగాడనే అనుమానంతోనే ఘాతుకం


    అమ్మాయి కనిపిస్తే చాలు..
    మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అమ్మాయి వెంటపడి వేధిస్తున్న ఓ యువకుడికి స్థానికులు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పారు. చెన్నూరు టౌన్‌ గాంధీ చౌక్‌లోని ఓ బట్టల దుకాణంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భాగ్య అనే యువతిని పట్టణానికి చెందిన చెన్నూరి సందీప్ అనే యువకుడు రోజు వెంటపడుతున్నాడు. ఆమెను అనేక విధాలుగా వేధిస్తూ వచ్చాడు. సోమవారం రాత్రి కూడా వస్త్ర దుకాణం మూసివేయగానే ఇంటికి వస్తున్న యువతిని ఫాలో అయ్యాడు సందీప్. తన వెనుక పడవద్దంటూ యువతి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వెనుక నుంచి ఆమెపై దాడి చేశాడు. సందీప్‌ యువతిని కొట్టిన సందర్భంలో అక్కడున్న కొందరు అతడ్ని పట్టుకున్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా స్నేహితుల సహాయంతో అక్కడి నుంచి పారిపోయాడు.



    చెప్పుతో చెంప చెళ్లు మనిపించింది..
    అమ్మాయిపై దాడి చేయడం, నడిరోడ్డుపై గొడవపడినప్పటికి సందీప్‌లో శాడిస్ట్ మనస్వత్వం శాంతించలేదు. అక్కడి నుంచి బాధితురాలు ఇంటికి వెళ్లడంతో తిరిగి రాత్రి సమయంలో సందీప్ ఆమె ఇంటికి వెళ్లి మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆడపిల్ల ఇంటికి వచ్చి మరీ దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె తండ్రి, సోదరుడు పట్టుకొని కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు. బాధితురాలితో చెప్పుతో కొట్టించారు. బాధితురాలితో దేహశుద్ధి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాగానే అప్పగించారు.

    ఇది చదవండి : ఖమ్మం జిల్లాలో పెళ్లి చేసుకున్న 48గంటల్లోనే గొంతుకోసుకున్న పెళ్లి కొడుకు .. ఎందుకంటే


    శాడిస్ట్‌ వేధవలు..
    యువతిపై దాడికి పాల్పడిన యువకుడు చెన్నూరి సందీప్ టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియా వారియర్‌గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత వారం రోజులుగా అమ్మాయిలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో చాలా మంది అధికార పార్టీకి నాయకుల బంధువులే ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మరో యువకుడు మంచిర్యాలలో యువతిని వేధిస్తూ పోలీసులకు దొరకాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం భయపడుతున్నారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే తర్వాత తమ బిడ్డను ఏమైనా చేస్తాడేమోనని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్లు బయటతిరగకుండా కేసు పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Manchiryala, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు