బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న యువతికి షాకింగ్ అనుభవం.. వైరల్‌గా మారిన వీడియోలు.. కానీ..

ప్రతీకాత్మక చిత్రం

బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు ఓ యువతికి మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. జీవితాంతం మరిచిపోని విధంగా ఆమె దెబ్బలు తినాల్సి వచ్చింది.

 • Share this:
  అబ్బాయిలు, అమ్మాయిలు మాట్లాడుకోవడం ఈరోజుల్లో చాలా కామన్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు ఓ యువతికి మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతునన ఆమెను కొందరు వ్యక్తులు చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌లో చోటు వెలుగుచూసింది. వివరాలు.. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడ అతనిని కలిసి మాట్లాడటం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు స్థానికులు అక్కడికి చేరుకుని.. ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. యువతి దుప్పట లాగి తీవ్రంగా దాడి చేశారు. వెంట్రుకలు లాగుతూ అమ్మాయి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారు.

  అయితే ఆ సమయంలో యువతి బాయ్‌ ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అక్కడి నుంచి పారిపోవడానికి అకాశం లేకపోవడంతో యువతి వారి చేతిలో చావు దెబ్బలు తింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వారం రోజులు కిందట ఈ ఘటన జరిగినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.

  కానీ ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. మరి వీడియోపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
  Published by:Sumanth Kanukula
  First published: