ఆమె ఓ వర్థమాన మోడల్. వయసు 19 ఏళ్లు. పలు షోలలో కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే ఆమె ఆశలన్నింటిని తనతో ఉంటున్న పార్టనర్ అడియాశలు చేశాడు. 19 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండేలా చేశాడు. ఇతరులతో చనువుగా ఉంటుందన్న అనుమానంతో దారుణంగా హత్య చేసి రోడ్డుపై పడేశాడు.ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... శనివారం ఉదయం... పందూర్న-నాగ్‌పూర్ హైవేపై గుర్తు తెలియని వ్యక్తి యువతి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె తలభాగమంతా తీవ్రంగా ఛిద్రమైనట్లు గుర్తించారు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... సోషల్ మీడియా ఆధారంగా మృతిచెందిన యువతి వర్థమాన మోడల్ ఖుషి పరిహార్‌గా గుర్తించారు. దిగ్దో ప్రాంతంలో ఆమె షేక్ అష్రఫ్ అనే 28 ఏళ్ల యువకుడితో కలిసి సహజీవనం చేస్తుందని తెలిసింది.
దీంతో వెంటనే కేసు విచారణ నిమిత్తం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అతడు ఆమెను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఖుషి క్యారెక్టర్‌పై అనుమానంతో అమ్మాయిని అంతమొందించానన్నాడు. వేరే వారితో చనువుగా ఉండటం చూసి భరించలేక...ఖుషిని హత్య చేసి రోడ్డుపై పడేశానని ఒప్పుకున్నాడు. కారులో వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఇదే విషయమై ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అష్రఫ్ యువతిపై దాడి చేశాడు. ఆమె తలను కారుతో తొక్కించి అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో అష్రఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.