Home /News /crime /

LIVE DEATH VIDEO NEAR FORTUNE HOTEL YOUTH STUCK WITH CAR POLICE START INVESTIGATION IN RAJKOT SU

Sad: పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు.. సీసీటీవీలో దృశ్యాలు.. అసలేం జరిగిందంటే..

పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టిన వ్యక్తి

పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టిన వ్యక్తి

ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

    ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి చనిపోయినట్టుగా వైద్యులు నిర్దారించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో (Rajkot) చోటుచేసుకుంది. వివరాలు.. బుధవారం (సెప్టెంబర్ 15) రాత్రి 9 గంటల సమయంలో ఫార్చూన్ హటల్ (Fortune Hotel) వెనక భాగంలో పార్క్ చేసి ఉన్న ఓ ఖరీదైన కారును ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఢీ కొట్టాడు. ఢీ కొట్టిన తర్వాత అక్కడే పడిపోయాడు. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లే ఇద్దరు మహిళలు ఈ దృశ్యాన్ని ఆందోళన చెందారు. వారు అక్కడి నుంచి దూరంగా జరిగారు.

    ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ అతని వద్దకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది మృతుడి శరీరంపై పదునైన ఆయుధంతో కోసిన గుర్తులు ఉన్నట్టుగా గుర్తించారు.

    Saidabad Rape Case: పక్కింట్లో ఉండే పాపపై అత్యాచారం, హత్య చేసి పరార్.. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?

    Shocking: గత ఏడాది కాలంగా సెక్స్ చేయలేదు.. అయితే డాక్టర్స్ అలా చెప్పేసరికి..
    ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రికి (Rajkot Civil Hospital) తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాత అతడి మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.


    Shocking: అతడు డాక్టర్.. ఆమె టీచర్.. 9 ఏళ్ల క్రితం నాటి వీడియోలతో..


    అతని మెడలో ఎవరో పొడిచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి నుంచి పారిపోయే క్రమంలోనే ఆగి ఉన్న కారును ఢీకొట్టి పడిపోయాడని, అప్పటికే గాయాలు ఉండటంతో అతడు మరణించాడని భావిస్తున్నారు. ఈ యువకుడు పరుగులు తీస్తూ వచ్చిన మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు మృతుడి ఎవరనేది గుర్తించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి  పోలీసులు పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక, ఈ ఘటన సంబంధించిన సీసీటీవీ వీడియో(CCTV Video) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Gujarat

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు