Home /News /crime /

LIQUOR SEIZED POLICE IN BIHAR MOVING IN AUTO PUSHPA MOVIE STYLE SNR

Bihar Pushpa: అక్రమ మద్యం తరలింపు కూడా పుష్ప సినిమా స్టైల్లోనేనా..వీడియో ఇదిగో

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Bihar Pushpa: బిహార్‌లో మద్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఓ కేటుగాడు పుష్ప సినిమా స్టైల్‌ని ఫాలో అయ్యాడు. సరుకు తీసుకెళ్తుండగా ఆటో యాక్సిడెంట్‌ కావడంతో ఆటో వదిలి పరార్ అయ్యాడు. మద్యం బాటిళ్లు ఆటోలో ఎక్కడున్నాయో కనిపెట్టేందుకు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తోంది. సినిమా్లో కొన్ని సీన్స్‌ని, ట్రెండ్‌ని యాజ్‌ టీజ్‌గా ఫాలో అవుతున్నారు కొందరు అక్రమార్కులు. ప్యాన్ ఇండియా మూవీగా వచ్చిన అల్లు అర్జున్‌(Allu Arjun) పుష్ప(Pushpa)మూవీ ఏ రేంజ్‌లో హిట్టైందో అందరికి తెలుసు. అందులో ఫారెస్ట్ అధికారుల కళ్లు గప్పి ఎర్రచందనం దుంగల్ని ఫారెస్ట్ దాటించేందుకు అల్లు అర్జున్‌ కొత్త టెక్నిక్స్‌ని ఫాలో అవుతాడు. ఈ సినిమా తర్వాత చాలా మంది ఇదే తరహాలో గంజాయి, డబ్బు, మద్యం వంటి వాటిని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. అయితే బీహార్‌ (Bihar)లో మద్యపాన నిషేదం అమలవుతోంది. అక్కడికి పొరుగున ఉన్న ప్రాంతాల నుంచి మద్యం తెచ్చేందుకు ఓ స్మగ్లర్ ఎక్సైజ్‌ అధికారులExcise officials కళ్లు గప్పి ఆటో(Auto)లో సరుకును తేవాలని ప్రయత్నించాడు. ప్లాన్‌ బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. కాకపోతే చిన్న యాక్సిడెంట్‌(Accident)జరగడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది. సుపాల్‌లోని జాడియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్‌ చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. జడియా అరారియా రహదారిపై అనంతపురం చౌక్‌ (Anantapur Chowk)సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఆటో ప్రమాదానికి గురవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా వచ్చి డ్రైవర్‌ని కాపాడారు. ఓవైపు ఆటో బోల్తా పడింది. గ్రామస్తులు వచ్చి డ్రైవర్‌ని కాపాడుదామనుకుని వస్తుండగానే డ్రైవర్ ఆటోని వదిలి పారిపోయాడు. అయితే డ్రైవర్‌ని కాపాడేందుకు ఆటో దగ్గరకు వచ్చిన గ్రామస్తులు డ్రైవర్ ఎందుకు పరార్ అయ్యాడో అర్ధం చేసుకోలేకపోయారు. ప్రమాదానికి గురైన ఆటో దగ్గరకు వెళ్లి చూడటంతో అందులోంచి మద్యం వాసన రావడంతో వెంటనే జాడియా పోలీసు(Jadia Police)లకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు యాక్సిడెంట్‌కి గురైన ఆటోలో మద్యం వాసన పసిగట్టి సరుకును ఎక్కడ దాచి పెట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

బిహార్‌ పుష్ప..
అయితే ఆటోలో ఎక్కడా మద్యం బాటిళ్లు కనిపించకపోవడంతో ఆటోను స్టేషన్‌కి తరలించారు. ఆటో అంతా వెతికిన తర్వాత పోలీసులు ఆటో టాప్‌పైన పడ్డాయి. అందులో భాగంగానే ఆటో సీలింగ్‌ కవర్ చిరిగిపోయి ఉండటంతో అక్కడ తనిఖీ చేశారు. అక్కడ రెండు వైపుల కాటన్‌ అట్టలను పెట్టి మధ్యలో ఇంగ్లీష్ మద్యం బాటిళ్లను ఆటో సీలింగ్‌ని ప్యాక్ చేశారు. అక్కడ నుంచి బయటపడిన మద్యం బాటిళ్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. సరుకు ఎంత ఉంది. ఎక్కడి నుంచి తెస్తున్నారో ఆరా తీశారు. పారిపోయిన ఆటో డ్రైవర్‌ని పట్టుకునేందుకు ఆటో నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్నియా జిల్లా పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. ఆ దిశగా స్మగ్లర్ కోసం గాలిస్తున్నారు.
సినిమాల ప్రభావం..

బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికి నుంచి అక్రమ మార్గాల్లో మద్యం ఏరులై పోరుతోంది. పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్ట్‌లు పెట్టి తనిఖీలు చేస్తున్నా..సిలిండర్‌లో, కారు బ్యానెట్‌లో సెల్లార్ వేసి అందులో మద్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఈక్రమంలోనే జాడియా ప్రాంతంలో కూడా ఆటో టాప్‌ కవర్‌లో ప్రత్యేకమైన కవర్ ఏర్పాటు చేసి అందులో మద్యం తరలిస్తున్నట్లుగా త్రివేణి గంజ్ డీఎస్పీ సుపాల్ గణపతి ఠాకూర్ తెలిపారు. అంతే కాదు ఏ సినిమాలోనైనా మంచి మెసేజ్‌ని రిసీవ్ చేసుకోని ప్రజలు..నేరాలు, అక్రమాలు, స్మగ్లింగ్, విలనిజం ఉన్న సినిమాల్లోని హీరోల పాత్రలు, విలన్ క్యారెక్టర్లను రోల్‌ మోడల్‌గా తీసుకొని రియల్ లైఫ్‌లో వాటిని అనుసరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar News, Crime news, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు