హోమ్ /వార్తలు /క్రైమ్ /

తప్ప తాగిన ట్రాఫిక్ పోలీసులు.. ఏకంగా పోలీస్ అవుట్ పోస్ట్ లోనే దావత్.... మత్తులో అధికారులు ఏం చేశారంటే..

తప్ప తాగిన ట్రాఫిక్ పోలీసులు.. ఏకంగా పోలీస్ అవుట్ పోస్ట్ లోనే దావత్.... మత్తులో అధికారులు ఏం చేశారంటే..

దావత్ చేసుకుంటున్న అధికారి

దావత్ చేసుకుంటున్న అధికారి

Ahmedabad: ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తప్పతాగి ఆ తర్వాత.. అక్కడ న్యూసెన్స్ చేశారు.

సాధారణంగా రోడ్లపై తాగి డ్రైవింగ్ చేసే వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేస్తుంటారు. వారు అధిక మోతాదులో మద్యం తాగితే దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. కొన్ని సార్లు మందు బాబులు మద్యం తాగి వాహానాలు నడిపించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. వీరు ప్రమాదంలో పడటమే కాకుండా, తోటి వారిని కూడా ఇబ్బందులలో నెట్టుతుంటారు. కొన్ని సార్లు, జనాలు ప్రాణాలు పోయిన సంఘటనలు గతంలో జరిగాయి. అయితే, ఇక్కడ వెరైటీగా తాగి రోడ్లపైకి వచ్చే వారిని పట్టుకునే మందు బాబులను పట్టుకునే అధికారులను తప్పతాగారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే మద్యం పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లో  (Gujarat) కొందరు పోలీసులు డిపార్ట్ మెంట్ పరువును తీశారు. ఈ ఘటన అహ్మాదాబాద్ లోని ట్రాఫిక్ అవుట్ పోస్ట్ లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కొందరు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు (Traffice department) మందు బాబులను మించిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ లోనే దావత్ చేసుకున్నారు. తప్పతాగి అక్కడ న్యూసెన్స్ చేశారు. అయితే, ఈ ఘటనను కొందరు స్థానికులు ఫోటోలు తీశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. దీంతో  ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు.

చట్టాన్ని కాపాడాల్సిన వారే, ఇలా చేయడం మేంటని స్థానికులు నోరెళ్ల బెడుతున్నారు. అదే విధంగా, మద్యం పార్టీలో.. అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ , సహా.. కనీసం నలుగురు పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఏఎస్సై కాంతిభాయ్ సోమాభాయ్ (53), ట్రాఫిక్ బ్రిగేడ్ (టిఆర్‌బి) జవాన్లు సోను పాల్ (22), రాకేష్ చందూభాయ్ (21), దినేష్‌భాయ్ భాలాభాయ్ (26)గా గుర్తించారు. దీనిపై అధికారులు ఉన్నతాస్థాయి అధికారుల ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా వెస్ట్ బెంగాల్ లో (West bengal) అమానుష ఘటన జరిగింది.

కోల్ కతాలోని మైదాన్ మెట్రోరైలులో ఈ ఉదంతం శనివారం జరిగింది. ఒక యువతి.. పార్క్ స్ట్రీట్ ఏరియాలో మెట్రో (Metro train)  ఎక్కింది. రైలు అంతా రద్దీగా ఉంది. అయితే, ఒక ముసలాయన యువతికి, సీటు ఇస్తానని పిలిచాడు. ఆ తర్వాత.. ఆమెతో మాటలు కలిపాడు. తాను రిటైర్డు ఉద్యోగి అని చెప్పుకున్నాడు. కాసేపటికి వెకిలిగా ప్రవర్తించసాగాడు.

అమ్మాయిని, అసభ్యంగా తాకుతూ.. పైశాచికానందం పొందాడు. దీంతో యువతి భయంతో అక్కడి నుంచి లేచింది. అతను ఆమెను ఫాలో అయ్యాడు. హోటల్ కు రావాల్సిందిగా అభ్యర్థించాడు. దీంతో యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Gujarat, Liquor, Traffic police, VIRAL NEWS

ఉత్తమ కథలు