హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: తల్లిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు.. జరిమానా సైతం విధించిన కోర్టు

Telangana: తల్లిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు.. జరిమానా సైతం విధించిన కోర్టు

నిందితుడికి శిక్ష పడేందుకు క‌ృషి చేసిన సిబ్బందిని అభినందిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్

నిందితుడికి శిక్ష పడేందుకు క‌ృషి చేసిన సిబ్బందిని అభినందిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్

తల్లిన చంపిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా సైతం విధించింది. ఈ మేరకు ఎల్బీ నగర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

  తల్లిన చంపిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా సైతం విధించింది. ఈ మేరకు ఎల్బీ నగర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన బురుసు కొండ‌య్య‌(45) అనే వ్య‌క్తి త‌న త‌ల్లి యాద‌మ్మ‌(80) హైదరాబాద్ నుంచి వలస వచ్చి హైదరాబాద్ లోని మీర్‌పేట‌లో నివాసం ఉంటున్నారు. అయితే యాదయ్య మద్యం, ఇతర చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో అతను అతను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొటున్నాడు. అయితే యాదయ్య తల్లి తనకు ఉన్న వారసత్వ ఆస్థిని అమ్మగా వచ్చిన రూ. లక్షను సత్యనారాయణ అనే వ్యక్తికి వడ్డీకి ఇచ్చింది. అతను వడ్డీ కింద ప్రతీ నెల రూ. 3 వేలను యాదమ్మకు ఇచ్చేవాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాదయ్య తన తల్లిని డబ్బులను అడిగి వేధించేవాడు.

  అయితే తల్లిని చంపితే ఆమె వడ్డీకి ఇచ్చిన డబ్బులు తన సొంతమవుతాయని కొండయ్య భావించాడు. ఈ క్రమంలో 13 జులై, 2016 న తెల్ల‌వారుజామున కుటుంబ సభ్యులంతా నిద్రపోయిన సమయంలో తల్లిని దారుణంగా హత్య చేశాడు. తలపై కొట్టి ఆమెను చంపేశాడు. అయితే ఆమె ప్రమదవశాత్తు చనిపోయిందని అందరినీ నమ్మించేలా ఆమె బట్టలు మార్చాడు. అక్కడ ఉన్న రక్తపు మరకలను సైతం శుభ్రం చేశాడు.

  బాధితురాలి కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె కొడుకే హత్య చేశాడని విచారణలో తేలడంతో కొండ‌య్య‌ను అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. నిందితుడికి శిక్ష పడేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కేసును రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో కోర్టు కొండ‌య్యను దోషిగా తేల్చి న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చింది. నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన పీపీని, విచారణ నిర్వహించిన పోలీసులను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Murder, Rachakonda Police

  ఉత్తమ కథలు