Lesbian couple: రక్షణ కల్పించండి.. కోర్టుకెక్కిన లెస్బియన్ జంట

Lesbian couple: తమకు రక్షణ కల్పించాలని ఓ లెస్బియన్ జంట కోర్టును ఆశ్రయించింది. తమపై కుటుంబ సభ్యులు దాడికి దిగుతున్నారని ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: September 27, 2020, 7:17 PM IST
Lesbian couple: రక్షణ కల్పించండి.. కోర్టుకెక్కిన లెస్బియన్ జంట
లెస్బియన్ జంట
  • Share this:
తమకు పోలీసు రక్షణ కల్పించాలని ఓ లెస్బియన్ జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాము ఒకరితో మరొకరు కలిసుండాలనే నిర్ణయాన్ని తమ కుటుంబీకులు వ్యతిరేకిస్తున్నారని ఆ జంట ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని శామ్లి జిల్లాకు చెందిన 22, 23 ఏళ్ల యువతులు కొన్నేళ్లుగా స్నేహితులు. కొంత కాలం తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది.

వాళ్లిద్దరు ఒకరు లేకుండా మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వీరి సంబంధాన్ని వీళ్ల కుటుంబ పెద్దలు వ్యతిరేకించారు. మీరిద్దరు కలిసి ఉంటే చంపేస్తామని హెచ్చరించారు. అయినా ఆ యువతులు వారి కుటుంబ సభ్యుల మాటలు వినలేదు. వారి గ్రామం నుంచి పారిపోయి జిల్లా కేంద్రమైన శామ్లికి వచ్చి ఉంటున్నారు. అయినా వారి కుటుంబ సభ్యుల దాడులు ఆగలేదు. దీంతో తట్టుకోలేక వారు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించి కాపాడాలని కోరారు. తాము ఎవరికీ ఇబ్బంది కల్పించడం లేదని.. అయినా తమపై దాడులు జరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై శామ్లి జిల్లా మెజిస్ట్రేట్ జసిత్ కౌర్ స్పందించారు. తమ వద్దకు రక్షణ కల్పించాలని 22, 23 ఏళ్ల ఇద్దరు యువతులు వచ్చారని చెప్పారు. వారిద్దరు వారు కావాలనుకున్న చోట స్వేచ్ఛగా జీవించవచ్చని స్పష్టం చేశారు. వీరు పోలీసు రక్షణ కావాలని శుక్రవారం అధికారులను కలిశారన్నారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ తగు ఆదేశాలు జారీ చేస్తారని చెప్పారు.
Published by: Nikhil Kumar S
First published: September 27, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading