Home /News /crime /

LEOPARD JUMPS FROM TREE AND ATTACK LOCALS IN EAST GODAVARI DISTRICT OF AP AS

పంజా విసిరి...గోళ్లతో రక్కేసింది...తూర్పుగోదావరిలో చిరుత బీభత్సం

చెట్టుపైన కూర్చున్న  చిరుత

చెట్టుపైన కూర్చున్న చిరుత

జనాలపై దాడిచేసిన అనంతరం..చిరుత ఓ కొబ్బరి చెట్టుపైకి ఎక్కి అక్కడే కూర్చుంది. చెట్టు మీద నుంచి వెళ్లికపోవడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు.

    తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపుర పరిసర ప్రాంతాల్లో చిరుతపులి హల్‌‌చల్ చేసింది. పంటపొలాల నుంచి జనావాసాల మధ్యకు దూసుకొచ్చిన చిరుత.. స్థానికులపై దాడి చేసింది. జనంపై పంజా విసిరి గోళ్లతో విచ్చలవిడిగా రక్కేసింది. చిరుతపులి దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఈ ఘటన జరిగింది. జనాలపై దాడిచేసిన అనంతరం..చిరుత ఓ కొబ్బరి చెట్టుపైకి ఎక్కి అక్కడే కూర్చుంది. చెట్టు మీద నుంచి వెళ్లకపోవడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

    andhra pradesh, AP news, Leopard attack, leopard attack video, cheetah attack, east godavari, ఏపీ న్యూస్, తూర్పుగోదావరి, చిరుత దాడి
    చెట్టుపైకి ఎక్కిన చిరుతపులి


    పంటపొలాల్లో మొదట ఓ వ్యక్తి చిరుతను గుర్తించాడు. వెంటనే చుట్టుపక్కల ప్రజలకు సమాచారం ఇవ్వడంతో..వాళ్లు కర్రలు, రాళ్లతో అక్కడికి వచ్చారు. చిరుత తరిమివేసేందుకు కర్రలతో భయపెట్టారు. కానీ అది నేరుగా గ్రామంలోకి వచ్చి స్థానికులపై దాడి చేసింది. అనంతరం చెట్టుపైకి ఎక్కి అక్కడే కూర్చుంది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా సమీప ప్రజలను అక్కడి నుంచి తరలించారు.

    andhra pradesh, AP news, Leopard attack, leopard attack video, cheetah attack, east godavari, ఏపీ న్యూస్, తూర్పుగోదావరి, చిరుత దాడి
    చిరుతను తరిమేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులు


    andhra pradesh, AP news, Leopard attack, leopard attack video, cheetah attack, east godavari, ఏపీ న్యూస్, తూర్పుగోదావరి, చిరుత దాడి
    చిరుత దాడిలో గాయపడిన స్థానికుడు


     

    చిరుత దాడి దృశ్యాలు ఇక్కడ చూడండి
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు