(K.Veeranna,News18,Medak)
మెదక్ జిల్లా (Medak District) లో చిరుత పులి దాడి (Leopard Attack) కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని ఏళ్లుగా రామాయంపేట (Ramayampeta) ప్రాంతానికి పరిమితమైన చిరుత దాడులు.. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తున్నాయి. ఎక్కడైతే అడవి ప్రాంతం ఉటుందో దాని చుట్టూ ఉన్న గ్రామాల వద్ద చిరుత పులులు ఏదో ఒక చోట దాడి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తూప్రాన్ రేంజి పరిధిలో పలు గ్రామాల్లో చిరుత పులి సంచారం చేస్తూ పశువుల పై దాడి చేస్తూ కనబడిన దృశ్యం స్థానికంగా గ్రామ ప్రజలకు భయాందోళన సృష్టిస్తోంది.
మెదక్ జిల్లా తూప్రాన్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని శివంపేట మండలం కొంతనపల్లి గ్రామంలో నేటి రాత్రి అటవీ సమీపంలో ఉన్న పశువుల పాక పై చిరుత పులి దాడి చేసి గ్రామానికి చెందిన నెల్లూరు అనే రైతుకు చెందిన పాడిగేదె పై దాడి చేసింది. దీంతో అది అక్కడిక్కడే చనిపోవడంతో పాటు.. పూర్తిగా ఆ ఆవును తినేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అటవీ సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఉండే పశువుల పాకల రైతులు ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా శివంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో దాడులు జరిగాయి. గత సంవత్సర కాలంగా చిరుత పులి దాడులు లేక ఊపిరిపీల్చుకున్న రైతాంగానికి ప్రస్తుతం కొంతనపల్లి లో జరిగిన చిరుత దాడి తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ ఘటనా స్థలాన్ని నర్సాపూర్ ఫారెస్ట్ అధికారులు సందర్శించారు. వారు ఆ ప్రాంతమంతా పరిశీలించి చిరుత దాడి గా నిర్ధారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
చిరుత పులి దాడి నేపథ్యంలో చిరుతలను బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఫారెస్ట్ బిట్ అధికారి శాంతి ప్రకటించారు. దాడిలో మరణించిన పాడిగేదె సుమారు 50 వేల రూపాయల విలువ చేస్తుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తరుచుగా చిరుతపులుల దాడులు చేస్తు ఉంటే మా బ్రతుకు భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతం లో పశువుల పై చిరుత పులి దాడులు జరిగినా.. మాకు ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం అందలేదన్నారు.
మెదక్ జిల్లా మొత్తం మీద కొంతనపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన చిరుత దాడి స్థానికంగా కలకలం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Leopard attack, Medak Dist