Home /News /crime /

LAWYER VAMAN RAO COUPLE MURDER CASE POLICE ARREST VELDI VASANTHA RAO SU KNR

Lawyer Couple Murder Case: వామనరావు దంపతుల హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు.. వెల్లడించిన పోలీసులు..

వామన్ రావు, నాగమణి (File)

వామన్ రావు, నాగమణి (File)

హైకోర్టు లాయర్ దంపతులు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసులు వెల్ది వసంతరావును అరెస్ట్ చేశారు.

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ఏడో నిందితుడిగా ఉన్న వెల్ది వసంతరావు(62)ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ DEEగా పనిచేసిన వెల్ది వసంతరావు 2018లో రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇక, తన స్వస్థలం గుంజపడుగలో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే కుంట శ్రీనుతో వసంతరావుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే గుంజపడుగు గ్రామంలో తాను నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి, ఇల్లు అక్రమ నిర్మాణమని గ్రామపంచాయతీ వాళ్ళ చేత గట్టు వామన్ రావు నోటీసులు ఇప్పించాడని కుంటు శ్రీను.. వసంతరావు తో చెప్పుకొని బాధ పడేవాడు.

  మరోవైపు గుంజపడుగు గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలు అందరూ కలిసి గతేడాది సెప్టెంబరు 24న వెల్ది వసంత రావు ని బ్రాహ్మణ కుల సంఘానికి అధ్యక్షుని గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి గుంజపడుగు గ్రామానికి పని మీద బ్రహ్మణ కులస్తులు ఎవరైనా వచ్చినట్లయితే వారు ఉండటానికి వసతిని ఏర్పాటు చేసి దానిని చూసుకోవడానికి తన గ్రామస్తుడైన ప్రదీప్ కుమార్‌ని ఇంచార్జ్ గా నియమించారు.

  ఇక, ఈ ఏడాది జనవరి 04 తేదీన బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆవిష్కరించడానికి పెద్దపెల్లి జడ్పీ చైర్మన్‌ను, మంథని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కానీ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కాలేదు. ఆ తరువాత గట్టు వామన్ రావు.. వసంత రావు కి ఫోన్ చేసి కుల సంఘం బిల్డింగ్ లో ఉంటున్న ప్రదీప్ ప్రవర్తన సరిగా ఉండటం లేదు అని అతను ఆ భవనంలో మందు తాగడం సిగరెట్లు తాగించడం లాంటివి చేస్తున్నాడని అతనిని ఆ పనిలో నుండి తీసివేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే జనవరి 24 తేదిన బ్రాహ్మణ సంఘం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు దానికి సుమారు 40 మంది హాజరయ్యారు. ఆ రోజు వామన్ రావు అతని అల్లుడు శ్రీనాథ్ ఫోన్ కు వీడియో కాల్ చేసి తనతో కొత్త వాట్సప్ గ్రూప్ ఎందుకు పెట్టినారు.. సంఘం క్యాలెండర్‌లో నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా పెట్టారు అని మీ అందరిపైన కోర్టు లో కేసులు వేస్తానని బెదిరించారు.

  అనంతరం జనవరి 26 రోజున జెండా వందనం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సంఘం భవనం ఇంచార్జి అయినా రేగళ్ళ ప్రదీప్ కుమార్‌ని గుంజపడుగు గ్రామస్తులైన గట్టు కిషన్‌రావు, గట్టు ఇంద్ర శేఖర్, బుడంగారి శ్రీనాథ్, వెల్ది సుధాకర్ కలిసి దాడి చేసి కొట్టినారు. వెల్ది వసంత రావు ఈ విషయాన్ని బ్రాహ్మణ సంఘం సెక్రటరీ అయినా గట్టు విజయ్ కుమార్‌ని పిలిచి ప్రదీప్ కుమార్‌ని మంథని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి గట్టు వామన రావు తండ్రి అయిన కిషన్ రావు, చంద్రశేఖరరావు, బుడంగారి శ్రీనాథ్ మరియు వెల్ది సుధాకర్ లపై మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పడం జరిగింది. దీంతో గట్టు వామన్ రావు, వెల్ది వసంత్ రావు‌పై జనవరి 29 రోజున రామగుండం పోలీస్ కమిషనర్‌కు కిషన్ రావు, చంద్రశేఖరరావు చేత పిర్యాదు చేయడం జరిగింది.

  బాల్య వివాహం.. చివరి క్షణాల్లో మహిళా కమిషన్ సభ్యుల ఎంట్రీ.. అసలు ఏం జరిగిందంటే..

  అదే రోజున వెల్ది వసంత రావు, అతని కొడుకు అవినీతి బాగోతం బయట పెడతాం ఏసీబీ వారికి ఫిర్యాదు చేసి వారిపై కేసులు పెడతామని గట్టు వామన్ రావు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పెట్టారు. ఈ సందేశం చుసిన తర్వాత వెల్ది వసంత రావు కుంట శ్రీనుకి ఆ రోజే పలుమార్లు ఫోన్ చేసి వామన్ రావు తనను మానసికంగా బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అతన్ని ఏదైనా చేయాలి అని కుంట శ్రీను ని కోరడం జరిగింది. అప్పుడు కుంట శ్రీను వెల్ది వసంతరావు‌తో వామన్ రావు మనల్ని ఏవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడో మనం కూడా అతన్ని ఇబ్బందులు పెడదామని చెప్పి బ్రహ్మణ సంఘం తరుపున సహకారాన్ని కోరాడు. దానికి సంబంధించి రామస్వామి గోపాలస్వామి గుడి పాత కమిటి చైర్మన్ గట్టు ఇంద్ర శేఖర్ ని తొలగించి కొత్త కమిటి ఎన్నుకొవటానికి సహకారాన్ని అందించాలని వసంత రావు ని కుంట శ్రీను కోరారు.

  Andhra Pradesh: తెల్లవారుజామున నిద్రలేచి లైట్ ఆన్ చేసిన మహిళ.. క్షణాల్లో ఘోర ప్రమాదం..

  ఇక, ఫిబ్రవరి 7న రామ స్వామి గోపాల స్వామి పాత కమిటీ రద్దు చేస్తూ నూతన కమిటీ ఏర్పాటు లో వెల్ది వసంతరావు ప్రధాన పాత్ర పోషించారు అని గట్టు వామన్ రావు అతనిపై కోపం పెంచుకున్నరు. అదే రోజు వామన్ రావు.. వెల్ది వసంత రావు యొక్క బంధువు అయిన డాక్టర్ రామ్ మోహన్ రావుని గట్టు వామన్ రావు హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించుకుని వసంతరావు ను చంపేస్తానని బెదిరించారు. ఈ విషయాన్ని మోహన్ రావు వెల్ది వసంత రావు కొడుకైన రామకృష్ణ కార్తిక్ ఫోన్ చేసి చెప్పగా తన కొడుకు ద్వారా ఈ విషయం తెలుసుకొని వసంత రావు, కుంట శ్రీను కి ఫోన్ చేసి బాధపడ్డారు. వామన్ రావుని ఏదైనా చేసి లేపెయ్యేలని కుంట శ్రీనును కోరగా.. దానికి కుంట శ్రీను వామన్ రావుని అవకాసం చూసి లేపేస్తానని చెప్పాడు.

  అందుకు ప్లాన్ చేశానని కుంట శ్రీను తెలిపాడు .వామన్ రావు పీడవిరగాడయ్యేలా చేస్తే దానికి అన్ని రకాల సహాయం చేస్తానని వసంత రావు, కుంట శ్రీను ను ప్రోత్సహించాడు. ఈ విధంగా వామన్ రావు దంపతుల హత్య కేసులో వెల్ది వసంత రావు భాగస్వామి అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు వసంతరావును విచారించి అనంతరం అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Peddapalli, Telangana Lawyer Vamanrao Murder

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు