మొబైల్ చార్జర్‌ కేబుల్‌తో భర్త హత్య.. మహిళా లాయర్‌కు జీవిత ఖైదు

భర్తను హత్య చేయడమే కాకుండా, కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నించిన ఓ మహిళా న్యాయవాదిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది.

news18-telugu
Updated: September 17, 2020, 1:12 PM IST
మొబైల్ చార్జర్‌ కేబుల్‌తో భర్త హత్య.. మహిళా లాయర్‌కు జీవిత ఖైదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్తను హత్య చేయడమే కాకుండా, కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నించిన ఓ మహిళా న్యాయవాదిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. వివరాలు.. అనిందిత పాల్ డే, రజత్ కుమార్‌లు కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా కోల్‌కతా హైకోర్టులో న్యాయవాదులుగా ఉంటూ.. నగర శివార్లలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు. అయితే 2018 నవంబర్ 25న అనిందిత తన భర్తను మొబైల్ చార్జర్‌ కేబుల్‌ను మెడకు చుట్టి హత్య చేసింది. ఆ తర్వాత తనకు ఏం తెలియనట్టు వ్యవహరించింది. రజత్ బెడ్‌పై నుంచి కిందపడి గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రజత్ ముఖం నీలం రంగులోకి మారి ఉండటం, గొంతుపై కూడా రాపిడి జరిగిన గుర్తులు ఉండటం గమనించారు. దీంతో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనిందిత కేసును తప్పుదోవ పట్టించడానికి చాలా రకాలుగా ప్రయత్నించింది. అయితే పోలీసులు చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గొంతు నులిమి చంపడం ఎలా దానిపై ఆమె ఇంటర్‌నెట్ సెర్చ్ చేసినట్టు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు ఉంచారు.

వీటిని పరిశీలించిన న్యాయస్థానం అనిందితను దోషిగా తేల్చింది. ఇందుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అలాగే కేసు విచారణ తప్పుదోవ పట్టించడంతోపాటుగా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన కేసులో ఆమెను దోషిగా తేల్చింది. కాగా, వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ కాల్స్‌కు సంబంధించి వీరిద్దరు పలు మార్లు గొడవపడ్డారని.. హత్య జరిగే రోజు కూడా వారి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: September 17, 2020, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading