హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lakhimpur case: సిట్ సంచలనం.. కుట్రపూరితంగానే హత్యలు.. కేంద్ర మంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు

Lakhimpur case: సిట్ సంచలనం.. కుట్రపూరితంగానే హత్యలు.. కేంద్ర మంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు

లఖీంపూర్ హింస కేసులో తాజా పరిణామం

లఖీంపూర్ హింస కేసులో తాజా పరిణామం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ హింస ఘటన యాక్సిడెంటల్ గా జరిగింది కాదని, ప్రణాళికాబద్ధమైన కుట్ర ప్రకారమే హత్యలు జరిగాయని సిట్ పేర్కొంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా సహా నిందితులందరిపై అభియోగాల సవరణకు సిట్ కోర్టు అనుమతి కోరింది..

ఇంకా చదవండి ...

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ప్రమాదవశాత్తూ కాదని, అది ముమ్మాటికీ ప్రణాళికబద్దమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా సహా నిందితులందరిపై అభియోగాలను సవరించాలని, కొత్తగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సిట్ నిర్ణయించింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందే నిందితులపై కొత్త సెక్షన్లు జోడించడానికి అనుమతి కోరుతూ లఖీంపూర్ కోర్టు న్యాయమూర్తికి సిట్ అభ్యర్థన లేఖ రాసింది. తాజా దర్యాప్తులో కొన్ని కీలక ఆధారాలు లభించాయని, అందుకే నిందితులపై అదనంగా సెక్షన్లు మోపేందుకు అనుమతివ్వాలని సిట్ కోరింది. ఈ పరిణామంతో కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్ మిశ్రా, ఇతర నిందితుల మెడకు ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకున్నట్లయింది.

ఈ ఏడాది అక్టోబర్ 3న, లఖీంపూర్ జిల్లాలోని టికునియా ప్రాంతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న రైతులను జీపుతో తొక్కించి చంపిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నాటి ఘటనలో జీపు కింద పడి కొందరు, యాక్సిడెంట్ తర్వాత పరస్పర దాడుల్లో మరికొందరు.. మొత్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. దీనిపై యూపీ పోలీసుల నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తుండగా, తొలి దశలో సాగిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు అడుగడుగునా అనుమానాలు వ్యక్తం చేయడం, ఆ తర్వాత పంజాబ్ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్ కుమార్ జైన్ పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలని కోర్టు ఆదేశించడం, సిట్ లోకి యూపీ యేతర ఐపీఎస్ అధికారులను చేర్చడం లాంటి పరిణామాలు తెలిసిందే.

shocking : భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య.. బలవంతపు సెక్స్ భరించలేక.. ఆమెపై IPC 324సెక్షన్జడ్జి పర్యవేక్షణలో.. ఐపీఎస్ విద్యారామ్ దివాకర్ నేతృత్వంలోని సిట్.. లఖీంపూర్ హింస ఘటనలో కొత్త ఆధారాలను సేకరించిందని, ఆ మేరకు నిందితులపై ఇప్పటికే ఉన్న అభియోగాల్లో కొన్నిటిని సవరించి, కొత్త వాటిని మోపేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరినట్లు డిఫెన్స్ లాయర్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి కోర్టుకు రాసిన లేఖలో.. లఖీంపూర్ హింస ఘటన ప్రణాళికబద్ధమైన కుట్ర అని సిట్ పేర్కొంది. మంత్రి కుమారుడు ఆశిశ్‌ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్‌ ఆ లేఖలో కోరింది.

పెళ్లికూతురుకు తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, కానుకలు వరకట్నం కిందికి రావు: హైకోర్టు సంచలన తీర్పులఖీంపూర్ హింస కేసులో కేంద్ర మంత్రి కొడుకు సహా 13 మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 304ఏ(హత్యగా పరిగణించలేని దాడి), సెక్షన్ 279(నిర్లక్ష్యపు డ్రైవింగ్), 338(తీవ్రంగా గాయపర్చడం) లాంటి సెక్షన్లను తొలగించాలని, వాటి స్థానంలో సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326(మారణాయుధాలతో దాడి చేయడం), 34(కూడబలుక్కొని మూకుమ్మడిగా నేరం చేయడం), ఆయుధాల చట్టం సెక్షన్లను మోపేందుకు అనుమతివ్వాలని లఖీంపూర్ కోర్టును సిట్ అభ్యర్థించింది. తాజా పరిణామంతో ఆశిశ్ మిశ్రా ఇతర నిందితులకు ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది. కోర్టుకు సిట్ లేఖపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ మరోసారి రైతులకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని, అంతకంటే ముందు మంత్రివర్గం నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని అన్నారు. రైతుల ఉద్యమం ఫలితంగా సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయడం తెలిసిందే.

First published:

Tags: Farmers Protest, Uttar pradesh

ఉత్తమ కథలు