Home /News /crime /

LAKHIMPUR KHERI CASE UNION MINISTER SON ASHISH MISRA NAMED PRIME ACCUSED IN 5000 PAGE CHARGE SHEET BY UP POLICE SIT MKS

Lakhimpur case : 5వేల పేజీల చార్జిషీట్.. కేంద్ర మంత్రి కొడుకే ప్రధాన కుట్రదారు: UP police SIT

లఖీంపూర్ కేసుపై సిట్ చార్జిషీట్

లఖీంపూర్ కేసుపై సిట్ చార్జిషీట్

రైతులను జీపుతో తొక్కించి చంపిన లఖీంపూర్ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రానే ప్రధాన కుట్రదారుగా సిట్ నిర్దారించింది. ఈ మేరకు 5000 పేజీల భారీ చార్జిషీటును సిట్ సోమవారం నాడు దాఖలు చేసింది. ఇప్పటికైనా ప్రధాని మోదీ తన మంత్రి మిశ్రాను కేబినెట్ నుంచి తొగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..

ఇంకా చదవండి ...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో హింసాకాండకు వేదికైన లఖీపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక విచారణ బృందం(సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు సహా మొత్తం ఎనిమిది మంది మరణించిన ఆ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రానే ప్రధాన కుట్రదారుగా సిట్ నిర్దారించింది. ఈ మేరకు 5000 పేజీల భారీ చార్జిషీటును సిట్ సోమవారం నాడు దాఖలు చేసింది. భారీ ట్రంకు పెట్టెల్లో తీసుకొచ్చిన వేలాది పత్రాలను సిట్ అధికారులు.. లఖీంపూర్ ఖేరీ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కు సమర్పించారు.

ఉత్తరప్రదేశ్, లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని తికునియా గ్రామంలో గతేడాది అక్టోబర్ 3న హింసాకాండ చోటుచేసుకున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఘటనా స్థలంలోనే ఉన్నారని, హింస కేసులో ఆయనే ప్రధాన నిందితుడని పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రా బంధువు పేరును కూడా చార్జిషీట్ లో పొందుపర్చారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, ముందస్తుగా ప్లాన్ చేసిన కుట్ర అని సిట్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Bulli Bai app : వేలానికి ముస్లిం మహిళలు.. సుల్లీ డీల్స్ తరహా.. అసలేంటీ యాప్? ఎవరు చేశారు?



లఖీంపూర్ హింసాకాండ కేసులో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ సహా మొత్తం 13 మందిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. తొలి దశలో కేసు దర్యాప్తు నిందితులకు అనుకూలంగా వెళ్లడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో యూపీ యేతర ఐపీఎస్ అధికారులతో సిట్ దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. కాగా, లఖీంపూర్ కేసుతో పరోక్షంగా ప్రమేయం కలిగుండి, సొంత కొడుకే నిందితుడిగా ఉండటంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

PM Modiపై షాకింగ్ ఆరోపణలు.. Amit Shah అంత మాటనేశారు: సత్యపాల్ మాలిక్ సంచలనం



తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను తొలి నుంచీ ఖండిస్తూ వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా.. అసలు ఘటన జరిగిన సమయంలో ఆశిష్ అక్కడ లేడని వాదిస్తూ వచ్చారు. కానీ కేంద్ర మంత్రి వాదనకు భిన్నంగా ఆశిష్ ఘటనా స్థలిలోనే ఉన్నాడని, అతనే ప్రధాన నిందితుడని సిట్ బృందం తేల్చింది. లఖీంపూర్ కేసులో 5వేల పేజీల చార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా నిందితుడి తండ్రిని కేంద్ర కేబినెట్ లో కొనసాగించడం సిగ్గు చేటంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతరులు విమర్శలు గుప్పించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Farmers Protest, Uttar pradesh

తదుపరి వార్తలు