Home /News /crime /

బర్త్‌డే పార్టీలో నగలు కొట్టేసి.. టిక్‌టాక్‌లో వీడియోలు.. కిలాడీ లేడీ కథ

బర్త్‌డే పార్టీలో నగలు కొట్టేసి.. టిక్‌టాక్‌లో వీడియోలు.. కిలాడీ లేడీ కథ

నిందితురాలు సంధ్యా బర్మ

నిందితురాలు సంధ్యా బర్మ

ఇక దొరకవులే అని అనుకున్న క్రమంలో.. ఓ టిక్ టాక్ వీడియోలో తన ఆభరణాలు, వాచీ కనిపించాయి. తన పక్కింట్లో ఉండే సంధ్య వర్మ అనే యువతే వాటిని ధరించి టిక్ టాక్ వీడియోలు చేసింది.

    టిక్ టాక్ అంటే తెలియని వారు దాదాపుగా ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని వాడుతున్నారు. అంతలా జనాలకు దగ్గరైంది ఈ చైనీస్ వీడియో యాప్..! టిక్ టాక్‌ను కొందరు టైమ్ పాప్ కోసం యూజ్ చేస్తే.. ఇంకొందరు మాత్రం సీరియస్‌గా దానికే పరిమితమయ్యారు. జనాలకు అంతలా దగ్గరైన టిక్ టాక్.. అసోంలో మరో కిలాడీ లేడీని పట్టించింది. బర్త్ డే పార్టీకి హాజరై బంగారు ఆభరణాలను కొట్టేసిన యువతి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.

    అసోంలోని గువాహటికి చెందిన జూరి దేకా అనే మహిళ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, ఫాస్ట్రాక్ వాచీ మాయమైంది. దాదాపు 6 నెలల క్రితం అవి మాయమయ్యాయి. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఇక దొరకవులే అని అనుకున్న క్రమంలో.. ఓ టిక్ టాక్ వీడియోలో తన ఆభరణాలు, వాచీ కనిపించాయి. తన పక్కింట్లో ఉండే సంధ్య బర్మ అనే యువతే వాటిని ధరించి టిక్ టాక్ వీడియోలు చేసింది. ఆ యువతికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయబ్బా.. అని ఆలోచిస్తే అసలు విషయం తెలిసింది. 6 నెలల క్రితం జూరి దేకా ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడులకు సంధ్య హాజరైంది. అందరూ పార్టీ హడావిడిలో ఉంటే ఈమె బంగారు ఆభరణాలు, రింగు, వాచీ కొట్టేసింది.

    ఐతే చాలా రోజుల తర్వాత వాటిని ధరించి టిక్ టాక్ వీడియోలు తీయడంతో.. అడ్డంగా దొరికిపోయింది సంధ్య. జూరి దేకా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంధ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే అసోంలో మరో కిలాడీ లేడీని కూడా టిక్ టాక్ పట్టించింది. ఓ వృద్ధురాలి ఇంట్లో కేర్ టేకర్‌గా పనిచేసే యువతి.. విలువైన వస్తువులు, దుస్తులు, ఆభరణాలు చోరీ చేసింది. అనంతరం పనిలోకి రాకుండా పారిపోయింది. చాలా రోజుల తర్వాత ఆ నగలు ధరించి టిక్ టాక్ వీడియోలు తీయడంతో.. అవి కాస్తా వైరలై చివరకు దొరికిపోయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Assam, Crime news, Tik tok, Tiktok

    తదుపరి వార్తలు