టిక్ టాక్..! యువతకు పరిచయం అక్కర్లేని మొబైల్ అప్లికేషన్..! అంతలా జనాలకు దగ్గరైంది ఈ చైనీస్ అప్లికేషన్..! టిక్ టాక్‌ను కొందరు టైమ్ పాప్ కోసం యూజ్ చేస్తే.. ఇంకొందరు మాత్రం సీరియస్‌గా దానికే పరిమితమయ్యారు. నిత్యం వీడియోలు తీయడం.. వాటిని సృజనాత్మకంగా రూపొందించడ.. ఒక డ్యూటీలా చేస్తున్నారు. జనాలకు అంతలా దగ్గరైన టిక్ టాక్.. అసోంలో ఓ కిలాడీ లేడీని పట్టించింది. ఓ వృద్ధురాలి ఇంటి నుంచి లక్షల విలులైన ఆభరణాలు, దుస్తులు తస్కరించిన దొంగను బయటపెట్టింది.
అసోంలని జోర్హత్‌కు చెందిన సుమి కలితా అనే యువతి ఓ వృద్ధురాలికి కేర్ టేకర్‌గా పనిచేసింది. తల్లి అనారోగ్యం పాలవడంతో బాగోగులు చూసుకునేందుకు..ఆమె కుమారుడు సుమిని పనిలో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ వృద్ధురాలికి కావాల్సిన పనులను సుమి చేసిపెట్టేది. ఐతే మొదట్లో మంచి మనిషిలా నటించిన సుమి.. ఆ తర్వాత అసలు పని మొదలుపెట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం చేసేది. వృద్ధురాలి ఇంటి నుంచి రూ.లక్షల విలువైన ఆభరణాలు, బట్టలు కాజేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పనిమానేసింది. సుమి కోసం వెతికినప్పటికీ వారికి చిక్కలేదు. ఐతే టిక్ టాక్‌లో వేరొక పేరుతో ఐడీ రూపొందించి వీడియోలు తీసింది సుమి. ఆ ఇంట్లో చోరీ చేసిన ఆభరణాలు, దుస్తులతో మంచి మంచి వీడియోలు తీసింది. ఆ వీడియోలు వైరల్ కావడంతో.. చోరీ అయిన వస్తువులను వృద్ధురాలి కుటుంబ సభ్యులు గుర్తించారు. టిక్ టాక్ వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
@anamikaboruah81 Meri life meri Mrzi
♬ original sound - user595910
@anamikaboruah81 ♬ original sound - Ranjeet Pradhan
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Tik tok